ఒకప్పుడు యాంకర్ అంటే.. తెల్లగా ఉండాలి.. వాయిస్ ఉండాలి.. అని అనుకునే వారు. కానీ ఇప్పుడు యాంకర్లు అలా లేరు అబ్బా.. హీరోయిన్స్ కి ఏమాత్రం తీసుపోని గ్లామర్ తో కొనసాగుతున్నారు.. చెప్పాలి అంటే హీరోయిన్స్ కంటే ఎక్కువ గ్లామరస్ గా ఉంటున్నారు కొందరు బుల్లితెర బ్యూటీలు. 

 

ఇంకా ఇప్పటికే కొందరు యాంకర్లు సినిమాల్లో కూడా నటిస్తూ వారి నటన ఏంటో చూపిస్తున్నారు. అనసూయ, రష్మీ, శ్రీముఖి ఇలా అందార్లు కూడా బుల్లితెరపై హాట్ బాంబులా వారి అందాలను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే వారు చేసే ప్రతి పని పెడుతూ ఆకట్టుకుంటున్నారు. 

 

ఇప్పటికే వారు చేసే వంటలు.. హాట్ హాట్ వర్కౌట్స్ అన్ని తీసే పెట్టేస్తున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ కుర్ర యాంకర్ కూడా అలానే అందాలను చూపిస్తూ అభిమానులను పెంచుకుంటుంది. ఎవరు ఆ యాంకర్ అని అనుకుంటున్నారా? యాంకర్ విష్ణు ప్రియ. ఈ మధ్య కాలంలో హీట్ పెంచే ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.

 

క్వారంటైన్‌లో ఉన్న ఈ బుల్లితెర బ్యూటీ హాట్ వర్కౌట్స్క్‌ చేసి వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. డాన్స్‌‌నే వర్కౌట్స్ గా చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఇంకా ఇలాంటి వర్కౌట్స్‌ని మీరు ట్రై చేయండి.. మంచి కిక్ ఇస్తుంది అంటూ స్టెప్పులతో వీడియోస్ ను పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: