కొన్ని సీరియల్స్ సాంగ్స్ ఎప్పటికి ఒక అద్భుతంలానే ఉండిపోతాయి. సీరియల్ పేరు గుర్తుకు రాగానే పాట గుర్తొస్తుంది.. ఎందుకంటే అప్పట్లో సీరియల్ వచ్చేముందు ప్రతి రోజు ఖచ్చితంగా సీరియల్ ఇంట్రో సాంగ్ వేసేవారు.. ఇంకా కొందరు అయితే కొన్ని సీరియల్స్ ని ఆ ఇంట్రో సాంగ్స్ కోసమే సీరియల్స్ ని చూసేవారు.. అలాంటి సూపర్ హిట్ సీరియల్ సాంగ్స్ యేవో ఇప్పుడు చూద్దాం.. 

 

నమ్మకం..

 

ఈవీఎం వారి నమ్మకం.. ఈ సాంగ్ ఇప్పటికి ఓ మరుపురానిదే. నమ్మకం అని పేరు వినపడగానే ఆ ట్యూన్ వచ్చేస్తుంది.. 90స్ కిడ్స్ కి. 

 

అంతరంగాలు.. 

 

అంతరంగాలు.. అంతరంగాలు అంటూ అప్పట్లో పాట వచ్చేది.. ఇంకా ఈ సీరియల్స్ హీరోస్, హీరోయిన్స్ ఇప్పటికి ఒక అద్భుతం అనే చెప్పాలి. 

 

ఋతురాగాలు.. 

 

ఈ సీరియల్ ప్రతి ఒక్కరికి గుర్తు ఉంటుంది.. ఇంకా అమ్మ వాళ్ళని మీకు ఏ సీరియల్ అంటే ఇష్టం మా? అని అడిగితే ఋతురాగాలు సూపర్ హిట్ సీరియల్.. ఆ పాత ఎంత బాగా ఉంటుందో అని అంటారు. అవును.. ఈ సీరియల్, ఈ సీరియల్ సాంగ్స్ అంటే ఎంతోమందికి ఇష్టం. 

 

చక్రవాకం.. 

 

సీరియల్ సాంగ్స్ లో ట్రెండ్ సెట్ చేసింది ఇదే. ఎందుకు అని అనుకుంటున్నారా? అప్పట్లో లవ్ అనేది కరువాయే.. ఇంకా అలాంటిది ఈ సీరియల్ కేవలం లవ్ కోసం తీసింది.. హీరో, హీరోయిన్ సినిమాలో కంటే ఎక్కువ లవ్ సీన్స్ చూయించారు.. చెప్పాలి అంటే ఈ సీరియల్ సాంగ్ ని బీట్ చేసే సీరియల్ సాంగ్ ఇప్పటికి రాలేదు. 

 

అన్వేషిత.. 

 

ఈ సీరియల్ హార్రర్ సీరియల్. అప్పట్లో ఓ ఊపు ఊపు ఊపింది.. అన్వేషిత అంటూ వచ్చే ఈ సాంగ్ అందరికి గుర్తుండిపోయింది. 

 

పిన్ని.. 

 

కృష్ణమ్మకు.. గోదావరికి తోడేవారమ్మా అంటూ చిన్న పిల్ల వాయిస్ తో వచ్చే ఈ సాంగ్ అందరికి చాల ఇష్టం.. త్వరలోనే పిన్ని 2 సీరియల్ రానుంది. 

 

అమృతం.. 

 

ఇది అప్పట్లో కేవలం ఆదివారం రాత్రి మాత్రమే వచ్చేది.. కానీ ఈ పాట అందరికి గుర్తుంది. ఎందుకంటే ఈ అమృతం సాంగ్ నిజంగానే అమృతం మరి.. అరే.. ఆంజినేయలు అంటూ వచ్చే పాటలు ఎప్పటికి గుర్తుంటాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: