అవును.. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాం గుర్తుందా? ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! ఈ షో గురించి తెలియని తెలుగు ప్రజలు ఉండరు.. అప్పట్లో టీవిలో దుమ్ము రేపిన షో ఇది. ఈ షోలో చిన్న పెద్ద అనే తేడా ఏమి లేదు.. అందరూ చెయ్యచ్చు.. అందరూ వారి ట్యాలెంట్ ని చూపించచ్చు .. వారికీ ఎంత టాలెంట్ ఉంది అనేది ఈ షోపై చూపించచ్చు.. 

 

కేవలం పాటకు డ్యాన్స్ వేస్తారు అని అనుకునే ప్రజలకు.. గ్రూప్ డాన్స్, సోలో డాన్స్, కపుల్ డాన్స్, డ్యూయెట్ డాన్స్ అనే క్యాటగిరీస్ ఉంటాయి అని తెలిపిన డాన్స్ షో ఇది. అన్ని డాన్స్ షోస్ లో ది బెస్ట్ డాన్స్ షో ఏది అంటే ఇదే. అందరికంటే అద్భుతమైన డాన్స్ షో ఇది. ఇంకా అలాంటి ఈ షో కి స్టార్టింగ్ లో కమెడియన్ అలీ, నటి జాన్సీ హోస్ట్ గా వ్యవహరించారు. 

 

ఇంకా ఈ మధ్య కాలంలో ఆటా సిరీస్ లో వచ్చిన డాన్సర్స్ అంత అప్పట్లో చిన్న పిల్లలుగా జెమినీ టీవీలో అవార్డ్స్, టైటిల్ విన్ అయినా వాళ్లే. అప్పట్లో వారి డాన్స్ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఇది మంచి షో. ఇంకా ఇప్పుడు వచ్చే డ్యాన్స్ షో లో ఉండే మాస్టర్ తాతా, స్కోర్స్, అన్నయ్యలు, జడ్జీలు, కొట్లాటలు ఏమి ఉండేవి.. 

 

ఈ షో అంత డాన్స్, డాన్స్ అంతే.. అంతకు మించి ఏమి ఉండవు.. ఇంకా ఈ షో తర్వాత దీనికి మించిన షో ఇప్పటి వరుకు రాలేదు అంటే నమ్మండి.. ఏది ఏమైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే.. అప్పుడు ఈ షోస్ కోసం ప్రత్యేకంగా టీవీ పెట్టుకొని మరి చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు టీవీ పెట్టాలి అంటే.. ఆ సోది అవసరమా? అనిపిస్తుంది. ఎందుకంటే అంత కంటెంట్ ఉన్న షో ఇప్పుడు రావడం లేదు కాబట్టి. 

మరింత సమాచారం తెలుసుకోండి: