మనం అనుకుంటాం కానీ.. టీవిలో వచ్చే కొన్ని ప్రోగ్రామ్స్ కి బలే అడిక్ట్ అయిపోతాం.. ఇంకా దెయ్యం సీరియల్స్ కి, ఎమోషనల్ సీరియల్స్ కి, లవ్ సీరియల్స్ కి ఇలా ఒకటి ఏంటి ? అన్నిటికి అడిక్ట్ అయిపోతాం... అలానే డిటెక్టివ్ వాటికీ కూడా బాగా కనెక్ట్ అయిపోతాం.. సినిమాల్లో ఎక్కడో ఒక సీన్ డిటెక్టీవ్ సిన్ ఉంటుంది.. కానీ సీఐడిలో ఎపిసోడ్ అంత వెతకడమే.. 

 

ఆ తప్పు ఎవరు చేశారు ? ఎవరు చంపారు? ఆ ఏడుపు వెనుకే అసలు నిజం ఉందా అని అన్ని సెర్చ్ చేసేవారు.. సెర్చ్ చెయ్యడమే పని అనుకోండి.. ఇంకా ఈ సీఐడి కూడా అంతే.. స్టార్ మా లో రాత్రి 10 గంటలకు వచ్చేది.. కానీ అంతవరుకు మేల్కొని మరి ఆ సీరియల్ ని చూసేవారు అంటే నమ్మండి.. 

 

ఇంకా అలాంటి ఈ సీఐడీ ఇప్పటికి ఓ అద్భుతమే.. దీనికి చిన్నపిల్లలా నుండి పెద్ద వాళ్ళ వరుకు అందరూ సూపర్ ఫ్యాన్స్ ఏ.. ఈ సీరియల్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండేది మరి.. మళ్లీ మళ్లీ చూడాలి అని అనిపించే రేంజ్ లో ఈ సీరియల్ ఉండేది.. ఇన్వెస్టిగేషన్.. సస్పెన్స్ అబ్బో నరాలు తెగిపోయేవి లెండి.. 

 

ఇంకా ఇది తెలుగులో కొద్దీ కాలమే వచ్చినప్పటికీ సోనీ టీవీలో 1998 నుండి 2008 వరుకు ప్రసారం అయ్యింది.. అయితే మరికొంత కాలం గ్యాప్ తీసుకొని మళ్లీ స్టార్ట్ అయ్యింది.. ఏమైతేనేం ఈ డబ్బింగ్ సీరియల్ కి కూడా మంచి ఫోలోయింగ్ ఉంది మరి.. అప్పటికి ఎప్పటికి ఈ సీరియల్ ఏ సూపర్ హిట్టు.                                          

మరింత సమాచారం తెలుసుకోండి: