అవును.. జీవితంలో అన్ని మారాయి.. ఈ రెండు న్యూస్ ఛానెల్స్ తప్ప. ఏళ్ళు గడుస్తున్నాయి.. క్రమంగా అన్ని మారుతూ వస్తున్నాయ్.. అమృతం సీరియల్ అయిపోయే పదహారు సంవత్సరాలకు అమృతం 2 వస్తుంది.. అన్ని సినిమాలకు రీమేక్ లు వస్తున్నాయ్.. కానీ ఈ ఛానెల్స్ న్యూస్ మారడం లేదు.. కనీసం అవి వచ్చే సమయం కూడా మారడం లేదు.. అవి ఏంటి అంటే? 

 

దూరదర్శన్ న్యూస్, ఈటీవీ న్యూస్.. వచ్చేది అర్ధ గంట మాత్రమే.. కానీ మొత్తం ప్రపంచ వార్తలు అన్ని కవర్ అవుతాయి.. ఉదయం నుండి సాయింత్రం వరుకు కాదు కాదు 24 గంటలు వార్తలు వస్తున్నాయ్.. అయినా సరే.. ప్రజలెవరూ ఆ వార్తలు నమ్మడం లేదు.. వాళ్ళకి న్యూస్ లేక ఏదో చెత్త అంత వేస్తున్నారులే అని ప్రజలు అనుకుంటారు. 

 

కానీ ఈ అర్ద గంట వార్తలు మాత్రం చూస్తారు.. వీటికి ఏమాత్రం టీఆర్పీ తగ్గడం లేదు.. దూరదర్శన్ లో 7 గంటల నుండి 7 గంటల ముప్పై నిమిషాల వరుకు  వస్తుంది.. కానీ పల్లెల్లో అందరూ ఆ ఛానల్ పెట్టి మరి ఆ న్యూస్ చూస్తారు.. పట్టణాల్లో కూడా కొందరు ఆ వార్తలు మాత్రమే చూస్తారు.. ఇంకా ఈ టీవీ న్యూస్ ఏమైనా తక్కువ? 

 

టీవీ న్యూస్ కూడా అంతే.. ఈటీవి న్యూస్ 9 గంటలకు వస్తుంది.. 9 గంటల 30 నిమిషాలకు అయిపోతుంది.. కానీ ఈ అర్ద గంట న్యూస్ నే నమ్ముతారు.. వాటి టైమింగ్ మారలేదు.. రైమింగు మారలేదు.. మ్యూజిక్ కూడా మారలేదు.. అందుకే ఏ దానికైనా టైమింగ్ ఉండాలి అని అనేది.. ఊరికే కాదు.. దశాబ్దాలు మరీనా ఈ న్యూస్ మారడం లేదు.. దానికి ఉన్న అభిమానులు మారడం లేదు..         

మరింత సమాచారం తెలుసుకోండి: