బుల్లితెరపై హాట్ పెయిర్ ఏంటి అంటే? సుధీర్ రష్మీ. వీరిద్దరి పెళ్లి కోసం జనాలు పడిగాపులు కాస్తున్నారు.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు... ఎప్పుడు చేసుకుంటారు అంటూ పీక్కుతింటున్నారు.. కానీ వారు మాత్రం పెళ్లి అంటే సెట్ లో నవ్వుకుంటున్నారు అని అంటూన్నాడు జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను. 

 

లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లేక ఇంట్లోనే ఉంటున్న గెటప్ శ్రీను ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్నాడు. ఇంకా ఈ నేపథ్యంలోనే తన ఫ్యామిలీ విషయాలతో పాటు బుల్లితెర హాట్ టాపిక్ సుధీర్ రష్మీ పెళ్లిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు..  గెటప్ శ్రీను మాట్లాడుతూ.. ఒకవైపు షూటింగ్ లేవు అనే బాధ ఉన్నప్పటికీ ఫ్యామిలీతో జీవిస్తున్నందుకు ఆనందంగా ఉంది. 

 

ఇంకా ఈ లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశ్యంతో మల్లెమాల వాళ్లు యూట్యూబ్ ఛానల్‌కి వీడియో చేసే అవకాశం కల్పించారు.. స్కిట్స్ టైప్‌లోనే చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాం అని చెప్పారు. ఇంకా ఈ నేపథ్యంలోనే సుధీర్ రష్మీ ప్రేమపై ఇలా స్పందించారు.. 

 

వాళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతుందని రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అయితే నేను సుధీర్ ఎలా ఉంటున్నామో, రష్మి-సుధీర్ అంతే. ఆన్ స్క్రీన్‌పై వాళ్ల పెయిర్ బాగా ఉంటుంది.. వాళ్లిద్దరి మధ్య పంచ్‌లు బాగా పేలుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాస్తుంటారు. జనరంజకం అవుతారని వాళ్లిద్దరి మధ్య అలాంటి సీన్లు పెడతారు. 

 

అయితే సుధీర్-రష్మిలు పెళ్లి చేసుకోవాలే కామెంట్స్ ఆడియన్స్ నుంచి ఎప్పటి నుంచి ఎక్కవయ్యాయంటే.. వీళ్లిద్దరూ ''పెళ్లి చూపులు'' అనే ఎపిసోడ్ చేశారు. ఆ ఈవెంట్ దగ్గర నుంచి మీరు ఇద్దరూ పెళ్లి చేసుకోండని ఆడియన్స్ అడుగుతున్నారు. నిజానికి రష్మి ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. సుధీర్ వేరే. వీరిద్ధరి కుటుంబ నేపథ్యాలు కూడా వేరే అంటూ రష్మీ సుధీర్ అభిమానుల కళపై నీళ్లు చల్లాడు గెటప్ శ్రీను. 

మరింత సమాచారం తెలుసుకోండి: