యాంకర్ రష్మీ.. ఈమె గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బుల్లితెరపై హంగామా చేస్తున్న ఈ యాంకర్ జీవితంలోనే ఎంతో ప్రత్యేకమైన గుర్తుండిపోయే పుట్టినరోజు జరుపుకుంది.. అంతగా ఏంటి? అసలు కరోనా వైరస్ నేపథ్యంలో బర్త్ డే ఏంటి? అతిథులు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అంత ఆశ్చర్యం వద్దు.. పాపం రష్మీ.. 

 

సెలబ్రెటీ లేదు.. ఏం లేదు.. కరోనా దెబ్బకు అందరూ ఒకటే.. దీంతో హోమ్ మెడ్ కేక్ తో ఎంతో సింపుల్ గా తన బర్త్ డే ని చేసుకుంది.. ఎటువంటి విందు, వినోదాలు లేకుండా తన పుట్టిన రోజుకు కేవలం తన కుక్కనే పెద్ద సెలబ్రెటీగా వచ్చింది.. ఇంకా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.  

 

అయితే రష్మీ బర్త్ డే వేడుకలు మూడు రోజుల ముందే జరగగా ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మి. తన తల్లితో తనకు ఎంతో ఇష్టమైన కుక్కతో బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది. అంతేకాదు.. 'హ్యాపీ బర్త్ డే మీ'.. హ్యాపీ బర్త్ డే మీ' అంటూ ఆమెకు ఆమె విషెష్ చెప్పుకుంటూ కేక్ కట్ చేసి.. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది రష్మి. 

 

ఇంకా అంతేకాదు.. ఆమె బర్త్ డేకు ఆమెకు ఎంతో ఇష్టమైన హల్వాతో పాటు.. మసాలా దోస, వడలను కూడా తన తల్లి తనకోసం చేసిందని.. తన ప్రతి బర్త్ డే కూడా తన తల్లితో కలిసే చేసుకుంటానంటూ ఇది చాలా హ్యాపీ మూమెంట్ అంటూ రష్మీ ఆ వీడియోలో ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చింది.. ఇంకా ఈ వీడియో చుసిన నెటిజన్లు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే చెప్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: