అవును అబ్బా.. ఈ ధర్మ సందేహం ఈ లాక్ డౌన్ లోనే పుట్టింది.. కరోనా వైరస్ తో సీరియల్స్ అన్ని ఆగిపోయాయి.. అయితే ఏంటి? ఇప్పుడు వరుకు ఉన్న సీరియల్స్ నే మళ్లీ వేస్తాం.. చూడాలి అనుకుంటే చుడండి లేకుంటే లేదు అని టీవీలో వేస్తున్నారు.. ఇంకా ఇంట్లో అమ్మ వాళ్ళు ఏమో ఎప్పుడు ఫోన్ ఏనా ? ఫోన్ పక్కన పెట్టి టీవీ చూడు అని అమ్మ అరుస్తుంది. 

 

ఇంకా చేసేది ఏమి లేక.. లోకల్ ఛానెల్స్ లో సినిమాలు లేక సీరియల్స్ చూడటం మొదలు పెట్ట.. అలా మొదలు పెట్టానో లేదో ఇలా సీరియల్స్ లో హీరోయిన్స్ ఏడ్చడం మొదలు పెట్టారు.. ఆదివారాలు లేదు.. సోమవారాలు లేదు.. ఎప్పుడు చూడు ఒకటే ఏడుపులు.. గత ముప్పై రోజులుగా ఏడుస్తూనే ఉన్నారు.. 

 

ఇటు చూస్తే వంటలక్క.. అటు చూస్తే అమ్ములు.. ఇంకా కొంచం పైకి ఎగిరి చూస్తే గోరింటాకులో శ్రీవల్లి.. ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవ.. ఎప్పుడు ఏడుపులే.. సరే స్టార్ మా అంత ఏడుపే ఉంది.. జీ తెలుగు పెడుదాం అంటే ఇందులో హీరోయిన్స్ ఏ కాదు సైడ్ క్యారెక్టర్స్ కూడా ఏడుస్తున్నాయి. ఇంకా జెమినీ టీవీలో అంతే.. ఈటీవీలో అంతే.. 

 

అయితే ఇక్కడ అన్న సీరియల్స్ లో సిమిలారిటీ ఏంటి అంటే? సీరియల్స్ లో ఏడ్చే అందరూ కూడా అమ్మాయిలే.. హీరోయిన్స్ ఏ.. అమ్మలు అమ్మములు మాత్రమే..హీరోస్ అసలు ఏడవారు.. మహా అంటే టెన్షన్ పడుతారు అంతే.. ఏ మగాళ్లకు కష్టాలు ఉండవా? మగాళ్లకు ఏడుపు రాదా? ఏ ఎందుకు రాదు అంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. దీంతో ఆ పోస్ట్ నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. ఇది అండి సంగతి.. కనీసం మీరు అయినా చెప్పండి.. సీరియల్స్ లో అబ్బాయిలు ఎందుకు ఏడవారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: