అవును.. యాంకర్ సమీరా ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు... ఈ లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరు చేసే పనే ఆమె కూడా చేసింది.. అయితే ఆమె ఇష్టమైన పని చేసింది.. ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.. రంజాన్ కదా! ఇప్పుడు ఎక్కడ హలీమ్ దొరకడం లేదు.. ఎంత ఉన్న ఇంట్లోనే చేసుకొని తినాలి.. అందుకే సమీరాను ఆమె అత్త సన ఇద్దరు కలిసి హలీమ్ చేసారు. 

 

ఆమె అత్త సన గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆమె కూడా ఎప్పుడు ఏదో ఒక సీరియల్ కనిపిస్తూనే ఉంటుంది.. ఇద్దరు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించే నటులే. ఇంకా ఈ నేపథ్యంలోనే వారు మిస్ అవుతున్న హోమ్ మెడ్ హలీమ్ ని చేసి సమీరా తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.. 

 

ఇప్పటికే అత్తతో కలిసి చికెన్ డమ్ బిరియాని రుచులను పరిచయం చేసిన సమీరా ఈసారి నోరు ఊరించే హలీమ్ రుచి చూపించించి.. చూస్తేనే నోరు ఊరిపోతోంది.. ఇంకా తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఊహించండి.. ఇంకా అలాంటి హలీమ్ ని ఏలా చేశారో ఓ లుక్ వెయ్యండి..

 

మటన్ హలీమ్‌కి కావాల్సిన పదార్థాలు

 

కందిపప్పు, 

 

శనగపప్పు, 

 

మినప్పప్పు, 

 

పెసరపప్పు, 

 

ఎర్రపప్పు - పిడికెడు చొప్పున, 

 

గరం మసాలా - 2 టేబుల్ స్పూన్లు, 

 

పెరుగు - 2 కప్పులు, 

 

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు,

 

కారం - సరిపడా, 

 

నెయ్యి - పావు కప్పు, 

 

పసుపు - కొద్దిగా, 

 

ఉప్పు - తగినంత, 

 

టమాటో - 2 లేదా 3, 

 

పుదీనా తురుము - గుప్పెడు, 

 

కొత్తిమీర తురుము - గుప్పెడు, 

 

మటన్ - 1 కిలో, 

 

గోధుమ రవ్వ - అర కిలో, 

 

ఉల్లిపాయలు - ఒక ప్లేట్, 

 

జీడిపప్పు - అర కప్పు, 

 

మిరియాలు - కొద్దిగా, 

 

నిమ్మకాయలు - 2, 

 

పచ్చిమిర్చి - 5 లేదా 6, 

 

ఉల్లిపాయలు - 2 , 

 

నూనె - తగినంత. 

 

ఇంకా ఇవి అన్ని చెప్పం కదా.. తయారీ విధానం ఏంటో అత్త కోడళ్ళు చెప్తారు.. ఓసారి వీడియోపై లుక్ వెయ్యండి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: