ఒకప్పుడు టెలివిజన్ రంగంలో సెన్సేషన్ సృష్టించిన సీరియల్స్ రామాయణం, మహాభారత్.  ఆ తర్వాత ఈ తరహా చారిత్రాత్మక దారావాహికాలు ఎన్నో వచ్చాయి.. కానీ వీటి క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏమీ తగ్గలేదు.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు పాత సీరియల్స్ దూరదర్శన్ లో పునః ప్రసారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామాయణం సీరియల్ దూరదర్శన్ లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. రామానంద్‌ సాగర్‌ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన రామాయ‌ణ్ సీరియ‌ల్ తొలుత 1987లో దూరదర్శన్‌ ప్రసారం చేసిన సంగ‌తి తెలిసిందే.

 

లాక్‌డౌన్ వ‌ల‌న మ‌ళ్లీ 33 ఏళ్ళ త‌ర్వాత ఈ సీరియ‌ల్ దూర‌ద‌ర్శ‌న్‌లో పునఃప్ర‌సా ర‌మైంది. మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 16 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్‌ను 7.7 కోట్ల మంది వీక్షించారు.  ఇది ప్రపంచరికార్డని డీడీ నేషనల్‌ చానల్‌ తన సోషల్ ఖాతాలో పోస్ట్‌ చేసింది.  ప్ర‌పంచంలో మ‌రే టీవీ సీరియ‌ల్‌ను కానీ, షోను కానీ ఒక్క రోజులో ఇంత‌మంది వీక్షించ‌లేదు. హాలీవుడ్ ప్రోగ్రాంల‌ను కూడా మ‌హాభార‌తం త‌ల‌ద‌న్నే స్థాయిలో వ్యూయ‌ర్‌షిప్ సంపాదించింది. ప్ర‌ముఖ హాలీవుడ్ షో గేమ్ ఆఫ్ థ్రోన్ ఒక్క రోజులో 1.85 కోట్ల వ్యూయ‌ర్ షిప్‌తో రికార్డు నెల‌కొల్ప‌గా.. షిప్ ది బిగ్ బ్యాంగ్ థియ‌రీ 1.7 కోట్ల వీక్ష‌ణ‌ల‌తో రెండో స్థానంలో ఉంది.   

 

ఇప్పటికే ఈ సీరియస్ దూరదర్శన్ లో రికార్డుల మోత మోగిస్తుంది.  తాజాగా రామాయ‌ణం సీరియ‌ల్ ఈ రికార్డ్ సాధించ‌డం ప‌ట్ల భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు త‌న  ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ప్ర‌శంసించారు.  మన గొప్ప సాంస్కృతిక , జానపద సంప్రదాయానికి కొత్త తరాన్ని పరిచయం చేయడంలో దూరదర్శన్ చేసిన ఈ ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను అని త‌న సోషల్  వెంకయ్య నాయుడు స్ప‌ష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: