అన్ని యాడ్స్ లలో థమ్స్ అప్ యాడ్స్ వేరయా.. అని అంటుంటారు కదా! నిజం అది.. ఆ థమ్స్ అప్ యాడ్ అంటేనే వేరు మరి.. బాబోయ్.. ఒక సినిమాకి యాక్షన్ సిన్ లా డిజైన్ చేసినట్టు ఉంటాయి థమ్స్ అప్ యాడ్స్. ఆ స్టాంట్స్ ఏంటి? హెలీకాఫ్టర్ లు బైక్ లు వేస్కుని ఒక కూల్ డ్రింక్ కోసం సముద్రాల్లో, అడవుల్లో, గాల్లోకి ఎగరడం ఏంటి? 

 

అలా ఎగిరిన తర్వాత టెస్ట్ ది థండర్ అంటూ ఈవేళ ఏదోటి అదరకొట్టాలి అని మనం బలంగా ఫిక్స్ అయ్యేలా ఉంటాయ్ థమ్స్ అప్ యాడ్స్. ఇప్పుడేమో మహేష్ బాబు అదరగొడుతుంటే, అప్పట్లో చిరంజీవి గారు తన థండర్ టేస్ట్ ని చూపించారు.. ఇంకా మహేష్ బాబు చేసిన యాడ్స్ లెక్క అయితే చెప్పలేం కానీ.. చిరంజీవి చెప్పగలం.. 

 

ఇంకా చిరంజీవి.. మహేష్ బాబు ఎన్ని యాడ్స్ చేశారు అనేది చెప్పలేం.. ఎందుకంటే ఈయన గారు సంవత్సరానికి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు చేసిన రోజులు ఉన్నాయ్. కానీ చిరంజీవి చేసిన యాడ్స్ మాత్రం దుమ్ము దులిపాయి.. మహేష్ బాబు కన్నా ముందు 1990 స్ సమయంలో పిల్లలు ఎంతో ఇష్టపడి థమ్స్ అప్ తాగేలా చేసిన చిరంజీవి ఏ.. 

 

అప్పట్లో థమ్స్ అప్ తాగడానికి కాస్త కరంగా ఉండేది కానీ అంతకన్నా ఎక్కువ చిరంజీవి గారు కారణం. చిరంజీవి అంబాసిడర్ అని తాగిన ఫస్ట్ థమ్స్ అప్ అప్పటి వారికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. అతను చేసిన థమ్స్ అప్ యాడ్స్ అప్పట్లో అందరిని ఆకట్టుకున్నాయి లెండి.. 1977 నుండి థమ్స్ అప్ రుచిని మనం ఆస్వాదిస్తున్నాం.. ఇక అది వచ్చినప్పటి నుండి ఎప్పటికప్పుడు టీవీ లో యాడ్స్ అదరగొట్టేవి.. ఈ థమ్స్ అప్ యాడ్స్ లో కొన్ని మన త్రివిక్రమ్ కూడా డైరెక్ట్ చేశారు.. ఒక్క నిమిషం యాడ్ చూసి మనకు తాగాలి అనిపించేలా చేసే యాడ్స్ మాములు విషయం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: