ఇండస్ట్రీ అన్నాక అవమానాలు తప్పవు.. ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద సెలబ్రెటీ అయినా ఎక్కడొక చోటా అవమానాలు తప్పవు. సెలబ్రెటికి ముందు జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఉంటాం.. ఆ కష్టాలలో అవమానాలు కూడా పడి ఉంటాం.. అలాంటి కష్టాలు.. అవమానాలు తలుచుకుంటే మనకు ఇప్పటికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అలాంటి అవమానమే పడ్డాడు జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను. 

 

జబర్దస్త్ కమెడియన్స్ లో గెటప్ శ్రీను ది ప్రత్యేక పాత్ర.. ఏ క్యారెక్టర్ లోకి అయినా పరకాయ ప్రేవేశం చేసి అందరి మనసులు దోచుకుంటాడు... ప్రజలందరినీ నవ్విస్తాడు.. ప్రతి స్కిట్ లో సరికొత్త ఆలోచనలు చూపిస్తూ తనకంటూ ప్రత్యేక అభిమాన అభిమాన వర్గాన్ని క్రియేట్ చేసుకున్నాడు. 

 

ఇంకా అలాంటి అయన అతని జీవితంలో ఓ దారుణమైన చేదు జ్ఞాపకము ఉంది అని చెప్పుకొచ్చాడు.. ''2007లో ఇండస్ట్రీకి రాకముందు.. అన్నపూర్ణ స్టూడియోలో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. దానికొక హీరో గెస్ట్‌గా వస్తున్నారని తెలిస్తే చూడటానికి వెళ్లాను. అక్కడ ప్రొడక్షన్‌లో తెలిసి ఒకతను ఉంటే.. రారా చూద్దూవుగానీ.. అని కూర్చోబెట్టారు... చాలా సేపు ఉన్నాను. 

 

హీరోని దూరం నుంచే చూసను. అంతా బాగానే అయ్యింది. భోజనం చేస్తున్నాను. భోజనం చేస్తుంటే ఎవరో ఒకతను వచ్చి ఎవర్రా నువ్వు? అన్నాడు. తెలిసినోళ్లున్నారండీ.. భోజనం చేస్తున్నాను అంటే.. వెంటనే అతడు కొన్ని దారుణమైన బూతులు తిట్టేసి.. బయటికి లాగించేశాడు. నేను చాలా దు:ఖంలో వెళ్లాను ఆరోజు.. భోజనం చేస్తున్నాను.. నాకు తెలిసి ఆయనే భోజనం చేద్దూగానీ నడు అని పిలిచాడు. ఒక వారం పాటు ఇది తల్చుకొని కన్నీళ్లు పెట్టుకున్న'' అంటూ చెప్పుకొచ్చాడు.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: