ఆంధ్రప్రదేశ్ సర్కార్ సినిమా టీవీ ప్రియులకు ఒక తీపి కబురు అందించింది. కరోనా వైరస్ ప్రభావంతో గత కొన్ని రోజులుగా షూటింగులకు అంతరాయం అవ్వగా.. మళ్లీ తిరిగి ప్రారంభించుకోవాలని కొన్ని నిబంధనలతో ఏపీ సర్కార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. పీవీపీ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహలకు 904.89 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇక ఏపీలో షూటింగ్లకు అనుమతి ఇస్తూ ఈ డిపాజిట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 

 


షూటింగులు సింగిల్ విండో పద్ధతిలో జరిపేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రాష్ట్రంలో నిర్దేశించిన ప్రాంతాలలో షూటింగ్ కి అనుమతి లేదని ప్రభుత్వం తెలియజేసింది. ఈ తరుణంలోనే 3 డిజిట్ కేటగిరిలో విభజించడం జరిగింది. మొదటి కేటగిరిలో భాగంగా రోజుకు 15 వేల రూపాయలు డిపాజిట్ తో... నగర పరిధిలో ఉన్న పార్కులు, మ్యూజియంలు పాఠశాలలు, కళాశాలల్లో షూటింగ్ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. 

 


అలాగే రెండవ కేటగిరిలో భాగంగా పదివేల రూపాయలు డిపాజిట్ తో విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులో, సరస్సులు, సెంట్రల్ లైబ్రరీ లలో షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక మూడవ డిపాజిట్ లో భాగంగా రోజు 5000 రూపాయలు డిపాజిట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు పార్కులు, అలిపిరి గార్డెన్స్ తో సహా అన్ని పార్క్ లో షూటింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇక ఈ అనుమతి రావడంతో సినిమాల కంటే సీరియల్ కు ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంది అని అర్థమవుతుంది. సినిమా షూటింగ్ లు మళ్లీ తిరిగి ప్రారంభమైన కానీ థియేటర్స్ లో సినిమాలు విడుదలయ్యే పరిస్థితి కనబడటం లేదు. సీరియల్స్ టీవీ లోనే కాబట్టి లాక్ డౌన్ సడలింపు వల్ల వారికి ప్రయోజనాలు జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: