ఇప్పుడు అంటే పిల్లలకు బయట ఆదుకోవడం.. ఇంట్లోకి వస్తే ఫోన్ పట్టుకొని ఆదుకోవడం.. కానీ ఒకప్పుడు అలా కాదు.. టీవీ ఉంటే చాలు బయట గేమ్స్ కూడా అవసరం లేదు.. అలా టీవీకి అతుక్కుపోయేవారు. ఇంకా ఏముంది అమ్మతో పాటు సీరియల్స్ చూడటం తప్పనిసరి. ఇంకా అందులో సాంగ్స్ అయితే ఇప్పటికి గుర్తు ఉంటాయి. అలా ఎంతోమంది పిల్లలకు తలనొప్పి తెచ్చిన సాంగ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి. 

 

అమృతం.. ఈ కామెడీ సీరియల్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిదేళ్లు ఈ సీరియల్ వచ్చింది. పిల్లలను అలరించింది.. ఇప్పటికి వారి గుండెల్లో ఉండిపోయింది. 

 

ఋతురాగాలు.. ఈ సాంగ్ అప్పట్లో మన అమ్మలకు ఇష్టం. ఇప్పటి ఈ పేరు వింటే సాంగ్ వచ్చేస్తుంది. 

 

నాన్న.. అమ్మ చెప్పింది అంటూ వచ్చే సాంగ్ గుండెల్లో నిలిచిపోయింది. 

 

ప్రియాంక... అమ్మ అంటూ వచ్చే సాంగ్ లిరిక్స్ సూపర్. ఇంకా ఈ సీరియల్ స్టోరీ నిజమైన కథ అంట!

 

అన్వేషిత.. అన్వేషితా అన్వేషిత అంటూ వచ్చే పాట అందరి మైండ్ లో నిలిచిపోయింది. 

 

లేడీ డిటెక్టివ్.. అమ్మాయి కాదు రో అంటూ వచ్చే ఈ సాంగ్ ఎంతమందిని ఆకట్టుకుందో. 

 

అంతరంగాలు.. ఈ సాంగ్ మీనింగ్ ఉండేది.. అలాగే అద్భుతంగాను ఉండేది. 

 

పిన్ని.. కృష్ణమ్మకు.. గోదారికి తోడేవారమ్మా అంటూ వచ్చే ఈ సాంగ్ అబ్బో.. ఇంకా ఈ సీరియల్ డబ్బింగ్ సీరియల్. 

 

మొగలిరేకులు.. మీరిసే మీరిసె మొగలిరేకులు అంటూ వచ్చే పాట అబ్బో.. అప్పట్లో ఓ వూపు వూపేసింది. 

 

చక్రవాకం.. ఈ సీరియల్ సాంగ్ మించిన ప్రేమ సాంగ్ ఇప్పటివరకు ఈ సీరియల్ కి రాలేదు అంటే నమ్మండి. 

 

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. ఈ సీరియల్ సాంగ్స్ లో మీరు ఏ సాంగ్ కి కనెక్ట్ అయ్యారో ఇక్కడ చెప్పండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: