మనం ఎంత ఎదిగిన మన చిన్నతనం అనేది మర్చిపోలేం.. మనకు కష్టం వచ్చిన ప్రతిసారి చిన్న పిల్లల అప్పుడే బాగుంది అని అనుకుంటాం. అవును చిన్ననాటి రోజులు అంత అందంగా ఉంటాయి. మళ్లీ మళ్లీ ఆరోజుల్లో ఉండాలి అనిపించేలా ఉంటాయి. అలా అనిపించడానికి కారణం కార్టూన్స్. 

 

కార్టూన్స్ మన చైల్డ్ హుడ్ డేస్ ని మరింత అందంగా చేసిన నేస్తాలు.. స్కూల్ కి వెళ్ళినమా, వచ్చినమా, స్ట్రీట్ లో ఫ్రెండ్స్ తో ఆడుకున్నామా.. టీవీ లో కార్టూన్స్ చూసినమా అలా ఉండేది లైఫ్. ఇంకా మనం టీవీ పెట్టాము అంటే ప్రతి కార్టూన్ థీమ్ సాంగ్ వినేవాళ్ళం. అంత అందంగా, వినాసంపుగా ఉంటాయి ఆ సాంగ్స్. 

 

ఇప్పుడు పేర్లు విన్న ఆ రాగాలు మన గొంతు నుండి వస్తాయి. అంత బాగుంటాయి సాంగ్స్. అప్పట్లో అయితే గట్టి గట్టిగా పడేవాళ్ళం. మనకు మంచి మెమోరీస్ గా మిగిలిపోతాయి.. ఇంకా కార్టూన్స్ అయితే.. అబ్బో ఇప్పటికి చూస్తాం కదా.. మిస్టర్ బీన్, టామ్ అండ్ జెర్రీ అయితే పిక్స్. మాటలు ఏం ఉండవు కానీ మనకు బాగా నచ్చేస్తాయ్. అలాంటి మంచి కార్టూన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

 

టామ్ అండ్ జెర్రీ, మిస్టర్ బీన్, బెన్ 10, డ్రాగన్ టేల్స్, విక్కీ ఆర్ వేథల్, ఆగడం బాగడం తీగడం, హీరో, పవర్ రేంజర్స్ ఏస్ పి డి,  డ్రాగన్ బాల్ జడ్, నాడ్డి, టైమన్ అండ్ పుంబా, రిచ్చి రీచ్, షకలక బూమ్ బూమ్, బాబ్ ది బిల్డర్, గాలి గాలి సిమ్ సిమ్, స్కూబ్య డూ, తజ్ మనియా, టీనేజ్ ముటాంట్ నింజా టార్టెల్స్, డక్ టేల్స్, ఫినియాస్ అండ్ ఫెర్బ్, కిడ్ వర్సెస్ క్యాట్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన షోస్ ఉన్నాయి. అలాంటి అద్భుతమైన షోస్ ని మీకు కుదిరితే ఓ సారి చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: