బిగ్ బాస్ వన్ విజేత శివబాలాజీ అభిమానులకు తన భార్య చేసిన వంటని శివ మధు కిచెన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. అయితే ఈ ఛానల్ ద్వారా కమ్మని వంటలను పరిచయం చేస్తున్నారు భార్యభర్తలిద్దరు. ఎగ్ రెసిపీ లతోపాటు, పన్నీర్ పొటాటో టిక్కా, చాపల పులుసు ఇలా అనేక వెరైటీ స్టైల్ లో టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చెబుతూనే అప్పుడప్పుడు బిగ్ బాస్ హౌస్ లో శివ బాలాజీ వండిన వంటలను కూడా వండి చూపించేస్తున్నారు.

 

ఇక ఇందులో భాగంగానే శివ బాలాజీ భార్య మధుమిత మరోసారి సరికొత్త వంటకంతో ఆవిడ వీడియోని పోస్ట్ చేశారు. మునక్కాయ పాలు కర్రీ అంటూ క్లియర్ గా వీడియోను తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇకపోతే చివర్లో శివ బాలాజీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం సూపర్ అండి అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక పోతే గతంలో KFC చికెన్, ఫిష్ కర్రీ అంటూ నటుడు శివ బాలాజీ చేసిన వీడియోస్ కి అభిమానుల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు ఆ వీడియో కి లైక్స్, కామెంట్స్ రూపంలో ఆ వీడియోకి అభిమానాన్ని చూపించారు. 

 

ఇక అందులో మీ బిగ్ బాస్ షో షీల్డ్ చూపించండి అంటూ అభిమానులు రిక్వెస్ట్ చేయడంతో, తర్వాత వీడియోలో బిగ్ బాస్ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు శివబాలాజీ. ఆ తర్వాత వీడియో లో శివ బాలాజీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఫిష్ కర్రీ ఎలా చేసాడో అని చెప్పిన విధానాన్ని వింటే నిజంగా నోరూరుతుంది ఆలా చెప్పి తయారు చేసారు కూడా. ఇక అదేమాదిరి ప్రస్తుతం తాజాగా మధుమిత కూడా అదే బాటలో పయనించింది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త వంట పరిచయం చేసింది. కొత్తగా మునక్కాయ పాలు కర్రీ వండేసి, అందులోని మునక్కాయ ముక్కలు ఎలా తినాలో కూడా చూపించేసింది మధుమిత.

మరింత సమాచారం తెలుసుకోండి: