కార్తీకదీపం.. ఈ సీరియల్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా ఈ సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తోన్న వంటలక్క అలియాస్ దీపకు ఉన్న ఫ్యాన్ బేస్ అయితే వర్ణణాతీతం. వాస్తవానికి ఒకప్పుడు తెలుగు సీరియల్స్ అంటే దూరంగా పారిపోయే ఆడియన్స్ కూడా ఇప్పుడు 'కార్తికదీపం' సీరియల్ లో వంటలక్కకి ఫ్యాన్స్ అయిపోయారు. కార్తీక దీపం దెబ్బకు పెద్ద పెద్ద సీరియల్స్ అన్నీ రేటింగుల్లో చాలా వెనకబడిపోతున్నాయి. అంతేకాదు, దేశవ్యాప్తంతా పెద్ద పెద్ద స్టార్స్ ప్రోగ్రామ్స్‌ను ఢీకొట్టి రేటింగ్స్ సాధించింన ఘనత ఈ సీరియల్‌కు మాత్రమే దక్కింది.
ఇక తెలుగునాట సక్సెస్ ఫుల్ షోగా పేరొందిన బిగ్ బాస్ రియాలిటీ షో సైతం కార్తీక దీపం సీరియల్ రేటింగ్స్ ముందు వెనుకబడిపోయింది. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని సినిమా, సీరియల్స్ షూటింగ్స్ నిలిచిపోయాయి. దీంతో ఆ ప్రభావం సీరియల్స్ మీద పడింది. రేపు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠగా ఎదురుచూసే సీరియల్ ప్రేక్షకులకు ఇది చాలా ఇబ్బందికర పరిణామం. ఇలాంటి క్రమంలో కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకుల కోసం రీ టెలికాస్ట్ చేస్తున్నారు. అంటే మొదటి నుంచి కార్తీకదీపం సీరియల్‌ను ప్రసారం చేస్తున్నారు.
కానీ, అభిమానుల్లో మాత్రం ఈ సీరియల్ మళ్లీ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందో అన్న నిరీక్షణ మొదలైంది. అయితే త్వరలోనే సీరియల్ స్టార్ట్ కాబోతుందుందనే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది స్టార్ మా. అందుకు సంబంధించిన ఓ ప్రోమో కూడా రిలీజ్ చేసింది. ఊ...ఊ...అందరూ.. రెడీగా.. ఉన్నారు... ‘మా’ ఫేవరెట్ ప్రోగ్రామ్స్ చూడ్డానికీ.. అంటూ మొదలైన ఓ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇందులో వెయిటింగ్ చాలిక.. స్టార్ మా ఒరిజినల్.. స్టార్టింగ్ సూన్ అంటూ కొనసాగిన ఈ ప్రోమో.. త్వరలో సీరియల్స్ స్టార్ట్ కాబోతున్నాయనే హింట్ ఇస్తోంది. దీంతో కార్తీకదీపం అభిమానులకి పండగ చేసుకుంటున్నారు.