ప్రతి ఇంట్లో టీవీ సీరియల్స్ కామన్.. మనకు నచ్చో.. నచ్చకుండానో మనం చూడాల్సినవి సీరియల్స్. ఎందుకంటే మన అమ్మనో.. లేదా అమ్మమ్మనూ.. అక్కనో ఇలా ఎవరో ఒకరు సీరియల్స్ చూస్తుంటారు. మనకు ఇరిటేషన్ వచ్చిన సరే సీరియల్స్ చూడాల్సిందే. పరిస్థితి అలా ఉంటుంది మరి. అయితే అలా చుసిన సమయంలో మనం కూడా ఆ సీరియల్స్ కి ఫ్యాన్స్ గా మారిపోతాం. అలా మారినా సీరియల్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి చుడండి.. 

 

మొగలిరేకులు.. ఆర్కే నాయుడు & మున్నా!

 

ఈ మొగలిరేకులు సీరియల్ తెలియని వారు ఉండరు.. అప్పట్లో అలా ఉండేది ఆ సీరియల్. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ ఎంత బాగుండేదో అంత బాగుండేది. ఇంకా అలాంటి ఈ సీరియల్ లో ఈ డ్యూయల్ రోల్ చాలా రేర్ ఉంటుంది.. ఒక కొడుకుగా.. తండ్రిగా నటించి ఇంట్లో ప్రేక్షకులను అందరికి దగ్గరయ్యాడు. ఇంకా వాళ్ళు ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకునే సీన్ అయితే యూట్యూబ్ లో క్రేజీ వ్యూస్ వచ్చాయి. 

 

అమృతం ఫ్యామిలీ!

 

ఇప్పుడు అమృతం 2 ఫ్యామిలీ వచ్చింది.. ఇంకా అప్పట్లో ఆ ఫ్యామిలీ అంత ఫేమస్. మనం సండే టైమ్స్ లో అయితే పొట్ట పగిలేలా నవ్వుతుంటిమి.. వారి వెర్రి అలా ఉండేది మరి. ఇంకా సర్వం.. అప్పాజీ కామెడీ అయితే మరి దారుణంగా ఉండేది. ఇంకా ఈ అమృతం సీరియల్ అయితే యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. 

 

చక్రవాకం ఇంద్ర, మొగలిరేకులు ధర్మ!

 

సీరియల్ లో హీరోయిజం లేకుండా కూడా ఇతనే హీరో అని నమ్మించే ఓకే ఒక క్యారెక్టర్ ఈ ఇంద్ర/ధర్మ! మొగలిరేకులు, చక్రవాకం సీరియల్ లో ఒకే రకమైన పాత్రలో మనల్ని అలరించిన హీరో. ఎంత హీరోయిజం ఉన్న క్యారెక్టర్ అయినా మనోడికి ఫ్రేండ్ అయిపోవాల్సిందే.. మనోడికి సపోర్ట్ చెయ్యాల్సిందే అలా ఉంటుంది పాత్ర. 

మరింత సమాచారం తెలుసుకోండి: