సీరియల్స్.. ప్రతి ఇంట్లో ఈ సీరియల్స్ కోసం ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. సీరియల్స్ అంటే అంత ప్రాణం. కానీ కరోనా వైరస్ కారణంగా ఒకరోజు కాదు రెండు రోజులు కాదు. ఏకంగా మూడు నెలలు సీరియల్స్ లేవు. సీరియల్ ప్రియులకు పిచ్చి పట్టేసింది అంటే నమ్మండి. ఇంకా అలాంటి సీరియల్స్ ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. 

 

ప్రముఖ తెలుగు ఛానళ్లు అన్ని కూడా ఈరోజు నుండి సీరియల్స్, రియాలిటీ షోలు ప్రారంభం అవుతాయని ఓ రేంజ్ లో అడ్వేర్టైజ్మెంట్లు చేసింది. నాన్ స్టాప్ వినోదానికి మరోసారి తేరా లేచింది. కరోనా వైరస్ కారణంగా సినిమా, సీరియల్ అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. పాత ఎపిసోడ్లు, గతంలో తీసిన కార్యక్రమాలను టీవీ ఛానెల్స్ ఈ కరోనా సమయంలో ప్రసారం చేస్తూ వచ్చాయి. 

 

IHG

 

ఇంకా ఇప్పుడు అన్ని సీరియల్స్, రియాలిటీ షోల కొత్త ఎపిసోడ్స్ ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ వల్ల ఇంట్లో ఉంటున్న టీవీ ఆర్టిస్టులతో ఎన్నో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేయించి టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. ఇంకా అంతే కాదు ... గతంలో ఈ షోస్ అయితే సూపర్ హిట్ అయ్యాయో ఆ షోస్, సీరియల్స్ అన్ని కూడా మళ్లీ ప్రసారం చేశారు. 

 

ఏది ఏమైతేనేం.. సీరియల్స్ ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. జెమినీ, ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని షో స్ అదిరిపోయే సీరియల్స్ మీకోసం వస్తున్నాయి. మరి ఈరోజు నుండి బుల్లితెరపై సందడే సందడిగా మారిపోయింది. ఈ లాక్ డౌన్ లో మీరు ఏ సీరియల్స్ మిస్ అయ్యారో ఇక్క కామెంట్ చేసి చెప్పండి.                

మరింత సమాచారం తెలుసుకోండి: