కరోనా వైరస్.. ఎవరి ఎప్పుడు ఎలా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ బారిన పడి కొన్ని లక్షల మంది మరణించారు. ఇంకా ఈ కరోనా కారణంగా ఇన్నాళ్లు ఆగిపోయిన సీరియల్స్, సినిమా షూటింగ్ లు అన్ని కూడా ఇప్పుడు ప్రారంభమయ్యాయి. 

 

IHG

 

అయితే ప్రారంభమైన వారానికే టీవీ పరిశ్రమలో కరోనా వైరస్ కలకలం రేపోతుంది. ఇప్పటికే ఇద్దరు టీవీ ఆర్టిస్టులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినా సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్ లో పాల్గొన్న అందరూ కూడా బెంబేలెత్తిపోయారు. అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే తెలుగు పాపులర్ యాంకర్.. డైరెక్టర్.. ఓంకార్ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చాయి. 

 

IHG

 

అయితే ఈ విషయంపై అయన క్లారిటీ ఇచ్చాడు. షూటింగ్స్ ప్రారంభమైన తర్వత ఓంకార్ హోస్ట్ అండ్ డైరెక్ట్ చేస్తున్న ''ఇస్మార్ట్ జోడీ'' షోకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్న ఓంకార్‌కు కరోనా పాజిటివ్ అని వార్తలు వచ్చాయి. అయితే జ్వరం అలసట ఉండటంతో ఓంకార్ కరోనా టెస్ట్ మాత్రమే చేయించుకున్నారని.. పాజిటివ్ అని తేలలేదని ఓంకార్ కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. 

 

IHG

 

కాగా ఓంకార్‌కి కరోనా పాజిటివ్ అని వార్తలు రావడంతో.. ఆయనతో‌ పాటు షూటింగ్‌లో పాల్గొన్న ఇతర సిబ్బంది బెంబేలెత్తిపోయారు. కాగా తెలుగు టీవీ షూటింగ్ లలో కరోనా ప్రభావం ఎక్కువ పడింది. ప్రభుత్వ గైడ్ లెన్స్ ప్రకారం మరింత జాగ్రత్తలతో టీవీ షూటింగ్స్ జరుగుతున్నాయి. ఏది ఏమైనా కరోనా ప్రభావం మాత్రం మాములుగా లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: