యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఏ షో చేసిన.. ఎవరితో మాట్లాడిన ఫస్ట్ అతని పెళ్లి గురించే మాట్లాడుతారు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ ప్రదీప్ అంటూ కొందరు ఏడిపిస్తే కొందరు ఆడుకుంటారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈటీవీలో ప్రసారం అయ్యే అలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్‌గా వెళ్లిన ప్రదీప్‌కి స్టార్ మా లో ప్రసారం అయినా పెళ్లి చూపులు గురించి రచ్చ జరిగింది. 

 

ఈటీవిలో ప్రసారం అయ్యే ''అలీతో సరదాగా'' షోకు సంబంధించిన ఓ ప్రోమో ఈరోజు విడుదల అయ్యింది. అయితే సాధారణంగానే పంచులతో.. డ్యాన్సులతో అద్భుతంగా ఉండే ఈ షో.. లాక్ డౌన్ తర్వాత మరింత జోష్ తో.. ఫుల్ పంచులతో వచ్చేసింది. ఇంకా జులై 6వ తేదీ ప్రసారం అయ్యే ఈ షోకు యాంకర్ ప్రదీప్, యాంకర్ సుమ వచ్చారు. ఇంకా అంతే అలీతో కలిసి రచ్చ రచ్చ చేశారు. పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఈ షో లో రచ్చ రచ్చ చేసారు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే యాంకరింగ్ కుటుంబానికి శివగామిగా సుమను పరిచయం చేశారు యాంకర్ ప్రదీప్. ఇక సెట్‌లో ఉన్న వాళ్లకు దోసెలు వేసి పెడుతూ షాకింగ్ ఎంట్రీ ఇచ్చాడు అలీ. ఇలా అద్భుతమైన ఎంట్రీలతో స్టార్ట్ అయినా ఈ షో లో.. అలీ మాట్లాడుతూ.. సుమ.. మన పెద్దోళ్లు చెప్పారు నీకు గుర్తుందో లేదో అంటూ అని అనగా.. నేను చిన్న దాన్ని కదా నాకు అంతగా తెలియదు అని పంచ్ వేసింది సుమ. ఇంకా అలా కంటిన్యూ అయినా ఈ షో ప్రోమోలో ఇంకా ప్రదీప్ పెళ్లి టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. 

 

 ప్రదీప్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా "ఈ లాక్ డౌన్‌లో పెళ్లి చూపులు ఏమైనా జరిగాయా?'' అని అలీ అడగ్గా.. ''ఏం లేదు సార్.. ఒక్కసారి జరిగినందుకే లాక్ డౌన్.. అయ్యింది సార్''!! అని అనడంతో పెద్దగా నవ్వేసింది సుమ. సుమ ఆధ్వర్యంలోనే కదా నీకు పెళ్లి చూపులు జరిగినవి అంటూ అలీ డౌడ్ రైజ్ చేశాడు.. ఇంకా అంతే సుమ మాట్లాడుతూ.. ''వద్దు సార్!! అతని పెళ్లి నా చావుకి వచ్చిందని తల పట్టుకుంది'' ఇలా ఎన్నో పంచులతో షో ప్రోమో రిలీజ్ అయ్యింది. మరి మీరు ఓసారి చూసేయండి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: