కార్తీక దీపం సీరియల్.. బుడ్డోడిని అడిగిన పాపం వంటలక్క అంటూ బాధపడతాడు. అలా ఉంటుంది ఆ సీరియల్. వంటలక్క మంచిది.. ఇంకా ఆమెకు పుట్టిన ఇద్దరు పిల్లలు మంచివారు.. ఆఖరికి వంటలక్క అత్త.. మామ కూడా చాల మంచివారు. పోనీ భర్త చెడ్డవాడ అంటే అది కాదు.. భర్త మంచివాడే కానీ అతని స్నేహితురాలు చెడ్డది. 

 

ఎన్నో ట్విస్టుల మధ్య అద్భుతమైన కథతో సాగుతున్న ఈ సీరియల్ లో ఒకో యాక్టర్ ఆస్కార్ లెవెల్ లో నటిస్తున్నారు. వంటలక్కను బాధను చూసి సినిమా సెలబ్రెటీలు సైతం కన్నీళ్లు పెట్టేస్తున్నారు అంటే నమ్మండి. కరోనా వైరస్ కారణంగా అడిగిపోయిన ఈ వంటలక్క సీరియల్ ఈ వారంలో ప్రారంభమయ్యింది.  

 

 

ఇంకా వంటలక్క ప్రియులు అంత సీరియల్ ను ఎంతో ఇంట్రెస్ట్ గా చూసేస్తున్నారు. ఇంకా సీరియల్ కూడా ఎంతో ఉత్కంఠంగా మారుతుంది. రోజు రోజుకు సీరియల్ లో టెన్షన్లు ఎక్కువ అయిపోతున్నాయి. నిజంగా వంటలక్క డాక్టర్ బాబుతో హిమ తన కూతురే అని చెప్పేస్తుందా? లేక ఆగిపోతుందా అనేది ఉత్కంఠంగా మారింది. 

 

ఇంకా రేపు ఎం జరుగుతుంది అనేది చుసిన మరి సోమవారం వరకు షాక్ పెట్టి పోతారు. అయ్యబాబోయ్.. నిజంగా ఈ సీరియల్ లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది. ఆ రేంజ్ లో ఉన్నాయి ఈ సీరియల్ లో ట్విస్ట్ లు. ఏది ఏమైనా ఈ సీరియల్ స్టోరీ లైన్ ఒకటే అయినప్పటికీ డాక్టర్ బాబు వంటలక్క మంచితనాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: