ప్రతి సీరియల్ లో హీరోయిన్ మంచిదే అయి ఉంటుంది. చెడ్డది అయితే అసలు ఆమె హీరోయిన్ ఏ కాదు. ప్రతి సీరియల్ లో హీరోయిన్ అందరికి హెల్ప్ చేస్తుంది. తల్లితండ్రులకు అండగా.. అక్కచెల్లెళ్లకు పాకెట్ మనీగా, తమ్ముడికి సహాయంగా ఉంటుంది ఈ హీరోయిన్. కానీ ఉపయోగం ఏంటి? ఈమె మాత్రం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. 

 

అందరూ స్వార్థంగానే ఉపయోగించుకుంటారు. పక్కన ఉన్నవాళ్లు చెప్తుంటారు.. ఇన్ని బాధల్లో ఎలా సంతోషంగా ఉన్నవే నువ్వు అని.. కానీ వాళ్లే కదా నా జీవితం అని ఆమె డైలాగులు వేస్తుంది. ఇంకా ఆలా డైలాగ్ వేస్తుందో లేదో లైఫ్ టర్న్ అయిపోతుంది. ఇది ఆమె త్యాగాలకు తగ్గ ఫలితం. సీరియల్ అంత హీరోయిన్ ఏడుపే. 

 

ఇంకా అలాంటి ఏడుపుతోనే ప్రారంభమైంది చెల్లిలి కాపురం సీరియల్. సీరియల్ ప్రారంభం నుండి ఏడుపులే. ఆమెకు ఒక చెల్లి ఉంది. ఇంకా సవతి తల్లికి ఇద్దరు పిల్లలు. వారికోసం ఆమె చదువు మానేసింది. ఉద్యోగానికి ఎక్కింది. అన్ని విధాలుగా ఇంటికి సహాయం చేస్తుంది. కనీసం పెళ్లి చేసుకొని అయినా జీవితం ఆనందంగా ఉంటుంది అంటే అది లేదు. 

 

చెల్లెలి కాపురం కోసం అక్క కాపురాన్నే త్యాగం చేస్తుంది. చెల్లి పెళ్లి కోసం అక్క తన జీవితాన్ని ఓ మతిలేని వాడిని పెళ్లి చేసుకుంటుంది. అసలు మనం జీవించేదే మన అందమైన జీవితం కోసం. ఆ జీవితాన్ని కూడా ఇంకొకరికోసం త్యాగం చేస్తే బ్రతకడం ఎందుకు. ఈ సీరియల్స్ ఎందుకు తీస్తున్నారు? దీని ద్వారా ఎవరికి ఉపయోగం.. సమాజానికి ఎం మెసేజ్ ఇస్తున్నారు అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి ఈ సీరియల్స్ పై మీ అభిప్రాయం ఏమిటి?                         

మరింత సమాచారం తెలుసుకోండి: