కోయిలమ్మ.. పాపం.. చిన్నప్పటి నుండి కష్టాలే. తల్లి తండ్రి చేసిన చిన్న పొరపాటుకు పుట్టిన బిడ్డకు ఎన్ని కష్టాలో. సీరియల్ ప్రారంభం అయ్యి నాలుగేళ్లు అయ్యింది. కానీ ఎన్ని కష్టాలు ఎదర్కొందో. ఆశతో ఉండే అత్త నుండి తప్పించుకోని, అసూయా, ద్వేషం, అసహ్యం ఉండే సవతి తల్లి దగ్గరపడి ఎన్ని కష్టలని ఎదర్కొంటుందో. 

 

IHG

 

మంచి పాటలు పాడగలదు.. మంచి మనసు ఉంది. తనతో ఎవరు పోటీ పడిన గెలవగలదు. ఒక్క సవతి కూతురు పోటీ పడితేనే ఓడిపోతుంది. సవతి తల్లి ప్రభావం. చిన్నికి దక్కాల్సిన ఆనందం అంత సింధునే కొట్టేస్తుంది. ప్రతి చోటా అంతే. సవతి తల్లి రాజకీయాల ముందు కోయిలమ్మ కష్టాలు మరింత పెరిగాయ్. 

 

IHG

 

ఎంతో ప్రేమగా చూసుకుండే తండ్రి కూడా ఆమెపై అసహ్యం పెంచుకుంటాడు. ఇలా ప్రతి చోటా సవతి తల్లి దారుణమైన బుద్ధులు ముందు చిన్న మంచితనం ఎక్కడికి వెళ్లాలో. సరే ఇద్దరు పెరిగారు.. ఇకపైన అయినా చిన్ని జీవితం బాగుంటుంది అంటే మంచి భర్త వస్తాడు అనుకుంటే వచ్చాడు. మంచి భర్తే బాగా చూసుకుంటాడు.. అక్కడ కూడా చిన్ని అసహ్యించుకునేలా సృష్టించారు. 

 

IHG

 

చిన్ని అయినా ఎం చేస్తుంది తల దించుకుంది. సింధు వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయి అని తెలిసిన సరే ఈ కోయిలమ్మ నోరు మెదపదు. మెదిపే వారిని  అది అని ఇది అని నోరుమూపిస్తుంది. మరి ఈ జన్మకు కోయిలమ్మ కష్టాలు తీరుతాయా? లేకా ఆ కష్టాలు తీరకుండానే బిడ్డను కని చచ్చిపోతుందా అనేది చూడాలి. ఏది ఏమైనా ఈ సీరియల్స్ చూస్తే అనిపిస్తుంది.. మంచికి కాలం లేదు అని. 

మరింత సమాచారం తెలుసుకోండి: