8వ వారం కొనసాగుతున్న బిగ్ బాస్ హౌస్ లో, ఇంటి సభ్యులు చిన్న పిల్లలుగా  మారిపోయారు.. డైపర్ల తో  దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. '"డే కేర్" టాస్క్ చేయాలని సూచించారు బిగ్ బాస్. ఇందులో కొందరు ఇంటి సభ్యులు చిన్న పిల్లలాగా మిగిలిన వారు వారిని సంరక్షించే కేర్ టేకర్స్ లాగా వ్యవహరించాల్సి ఉంటుంది.
వీరిలో అవినాష్‌, అరియానా, హారిక‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో పాటు మెహ‌బూబ్ కూడా చిన్న‌పిల్లల్లా మారిపోయి దానికి తగ్గట్టు డ్రెస్సప్ అయ్యారు.  గెటప్ ల సంగతి పక్కనపెడితే... నిజంగా చిన్న పిల్లల్లాగా డైపర్లు వేసుకోవడం అందరికీ నవ్వు తెప్పించింది.

మిగిలిన ఇంటి సభ్యులు ఎంతో ప్రేమగా వారి అందరినీ భరిస్తూ వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.. నిజానికి టాస్క్ ప్రకారం... చిన్నపిల్లలు అడిగిన‌వ‌న్నీ చేస్తూ వారిని ఏడవ‌కుండా చూసుకోవాలి... అదే వారి కర్తవ్యం. చిన్నపిల్లల వేసుకున్న ఇంటి సభ్యులు కావాలనే కేర్ టేకర్స్ ను ఇబ్బంది పెట్టే విధంగా అల్లరి చేస్తుండగా.... కేర్ టేకర్స్ మాత్రం ఎంతో ఓపికగా వారితో ఆడిపాడుతున్నారు.  అయితే ఈ టాస్కులో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారు విజేత అవుతారు అలాగే...వారికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని బిగ్ బాస్ తెలియచేయడంతో...ఇంటి సభ్యులు ఈ టాస్కు లో జీవిస్తున్నారని చెప్పొచ్చు. బిగ్ బాస్ షోలో ఇప్పటి వరకు ఇచ్చిన టాస్కులలో  ఒకమాదిరిగా ప్రదర్శన చేసిన వారికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు....

ఇప్పటికే హౌస్ సభ్యులనుండి టాస్కులు చేసే విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న హారిక మరియు అభిజిత్ లు ఈ టాస్కులో అయినా సరిగా మంచి ప్రదర్శన ఇస్తారని ఆశిద్దాం. మిగిలిన ఇంటి సభ్యులు అంతా కూడా ఇప్పటికే వారి వారి పాత్రలలో ఒదిగిపోగా..నోయెల్ మాత్రం తనకు ఇచ్చిన టీచర్ పాత్రపై సంతోషంగా లేకపోగా, బిగ్ బాస్ పై కామెంట్స్ చేసాడు...ఏంటి బిగ్ బాస్ మీరు ఏదో చేస్తారనుకుంటే...ఇలా చేసారు...అని తన అసంతృప్తిని వ్యక్తం చేసాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: