బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో వరం వారానికి...ఎంటర్టైన్మెంట్ పెరుగుతూ పోతోంది, అదేవిధంగా ఇంటి సభ్యుల లోని జోష్ కూడా అంతకంతకు పెరుగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో బేబీ డే కేర్ టాస్క్ కొనసాగగా... ఇల్లంతా సందడి సందడిగా  మారిపోయి చిన్న పిల్లల అల్లరి తో నిండిపోయింది. మరోవైపు కొందరి ఇంటి సభ్యుల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. హారిక కారణంగా అమ్మ రాజశేఖర్ మరియు అభిజిత్ లు వాదనకు దిగారు, వీరి మధ్య మాటల యుద్ధం కాస్త గట్టిగానే జరిగిందని చెప్పాలి. ఆ సమయంలో అభిజిత్ హారికను కూడా కాస్త గట్టిగానే అరిచాడు. ఇక పర్ఫామెన్స్ విషయానికొస్తే ఎప్పటిలాగే అవినాష్ తన కామెడీ టైమింగ్ తో అందర్నీ నవ్వులతో ముంచేశాడు.. అలాగే మెహబూబా మరియు హారికలు కూడా బాగానే హాస్యాన్ని పండించారు.

టాస్క్ కొనసాగుతున్న సందర్భంలో ప్రిన్సిపల్ గా వ్యవహరించిన లాస్య.... డే కేర్ సెంటర్ లో పిల్లలుగా వ్యవహరిస్తూ ఉంటే సభ్యులకు కొందరికి వారి నడవడికను బట్టి గుడ్ గర్ల్స్ .....అండ్ గుడ్ బాయ్స్ అంటూ చాక్లెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో హారిక ఇంటి సభ్యుల నుండి చాక్లెట్లు గేమ్ లో భాగంగా చిన్న పిల్లలాగా దొంగతనం చేసింది. కానీ ఈ వ్యవహారం ఇంట్లో పెద్ద గొడవలు తీసుకొచ్చింది. అమ్మ రాజశేఖర్ తన చాక్లెట్లు హారిక దొంగలించడంతో మండిపడ్డాడు. ఇంట్లో ఆమెను పరుగులు తీయించి మరి తను చాక్లెట్లు తను స్వయంగా హారిక పాకెట్ నుండి తీసుకున్నాడు. అలా ఆడపిల్ల పాకెట్ లో నుంచి స్వయంగా చాక్లెట్లు తీసుకున్న అమ్మ రాజశేఖర్  వ్యవహారశైలిపై లాస్య మరియు మోనాల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అప్పుడు అమ్మరాజశేఖర్ ..అది టాస్క్ లో భాగంగానే హారికను చిన్నపిల్లలా భావించి చాక్లెట్ తీసుకున్నానే  తప్ప మరి ఇంకేమీ లేదని వివరణ ఇచ్చాడు... అలా అలా బేబీ డే కేర్ టాస్క్ ముగిసింది. ఉత్తమ జంటను ఎంపిక చేయాలని యాంకర్ లాస్యను బిగ్‌బాస్ ఆదేశించగా... ఇంటిలో టాస్క్‌ను అరియానా, సోహైల్ జంట బాగా ఆడిందని లాస్య వారిద్దరిని ఎంపిక చేసింది. అరియనా మగవారికి ధీటుగా తన సత్తాను నిరూపించుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: