బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు ఏదోక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు..ఆన్ కెమెరా ఆఫ్ కెమెరాలు ఎలా ఉంటాయో ప్రజలకు చెప్తూ వస్తారు.. ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మెహబూబ్ కూడా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అందులో భాగంగా సంచలన నిజాలను బయట పెట్టారు. మాములుగా మెహబూబ్ సోహెల్ మంచి ఫ్రెండ్స్.. ఈ టాస్క్ లో అయిన కూడా ఇద్దరు కలిసి చేసేవారు.. ఇప్పుడు పాపం సొహెల్ ఒంటరి వాడయ్యాడు.. ప్రతి టాస్క్ లో వెనకడుగు వేస్తున్నారు..



అయితే సొహైల్ కంటే అభిజిత్‌తో తాను బాగా క్లోజ్‌గా ఉండేవాడినని.. కేవలం సొహైల్‌తో ఉన్నట్టుగానే చూపించారని చెప్తూ అభిజిత్‌తో ఉన్న తన బాడింగ్‌ గురించి ఆసక్తికరమైన కొన్ని నిజాలను బయట పెట్టారు.,పదో వారం వరకు సోహైల్ ,మెహబూబ్ తో మాత్రమే ఉన్నారు అని అనుకుంటారు..అయితే తాజాగా మరో నిజాన్ని నిర్భయంగా బయట పెట్టారు. అభిజిత్ తో కూడా సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఇద్దరిలోనూ ఉంటానని మెహబూబ్ అన్నాడు .



లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో కూడా అభిజిత్‌కి ఏమైనా వస్తే ఉంచుకోడు.. నాకు ఇచ్చేసేశాడు. అభిజిత్ ఎక్కువగా రోటీలే తింటాడు. రోటీ, పప్పు మాత్రమే తింటాడు. ఇంకేం తినడు. ఫుల్ డైట్ చేస్తాడు. ఒకవేళ నాన్ వెజ్ చేసినా.. మెహబూబ్ నాది కూడా నువ్ తినెయ్.. నీకు ప్రోటీన్స్ అవసరం అని నాకు ఇచ్చేసేశాడు. నా ఎక్స్ కూడా నువ్వే తిను అనేవాడు. హౌస్‌లో అంతకంటే ఏం కావాలి.. అభిజిత్ నన్ను ఒక తమ్ముడు లాగా చూసుకున్నాడు.. ఖచ్చితంగా బయట టాక్ మాత్రం అభిజిత్ విన్నర్ అవుతారని అంటున్నారు.. బిగ్ బాస్ లో ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు.. అభి నా లేక మరోకరా చూడాలి అంటూ మెహబూబ్ అన్నాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: