నిబిగ్ బాస్ సీజన్ 4 దాదాపు ముగింపుకు వచ్చింది.. పన్నెండో వారం ఎలిమినేషన్ కోసం మొన్న సోమవారం నామినేషన్ ప్రక్రియ ను కూడా పూర్తి చేసుకున్నారు. ఉన్న ఐదు మందిలో ఎవరికీ వారే అన్నట్లు ఇంటి సభ్యులు పోటీ పడుతున్నారు. అంతేకాదు చివరి ఎపిసోడ్స్ లో జనాలను ఎలా ఆకట్టుకోవాలో అని తెగ ప్రయత్నిస్తున్నారు. వాళ్లకు తోడు బిగ్ బాస్ కూడా పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఈ వారం ఒక సస్పెన్స్ క్యారక్టర్ ను ఇంట్లోకి తీసుకొచ్చారు. అదే జలజ దెయ్యం..



మొన్నటి నుంచి ఈ క్యారక్టర్ ఇంటి సభ్యులతో పాటుగా , బిగ్ బాస్ అభిమానులను కూడా ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది. నిన్నటి ఎపిసోడ్ కాస్త రసవత్తరంగా సాగింది. అఖిల్ , సోహైల్ ఇద్దరిని జలజ దెయ్యం ఓ ఆట ఆడుకుంది..హారిక అయితే పీకినవ్ లే తియ్ అంటూ దెయ్యంతో ఆడలు ఆడింది. సొహైల్ కూడా నేను చెయ్యా ఐతే ఏంటి అని హేళన చేశాడు. ఇక అవినాష్‌ అయితే దెయ్యాన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యి  జబర్దస్త్ జోకులను వేశాడు.




అవి కాస్త పేలక పోగా దెయ్యం చేతిలో చితక్కొట్టుడు అనే విధంగా దెబ్బలు తిన్నాడు..హౌస్‌ని దెయ్యాల కొంపగా మార్చేసి.. కన్ఫెషన్ రూంలోకి ఒక్కో ఇంటి సభ్యుడ్ని పిలిచి ఆటాడుకుంటున్నారు.12వ అంతస్తు దెయ్యం సినిమా చూపించి భయం కలిగించిన అనంతరం అరియానాను కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. అక్కడ దెయ్యం అరుపులు విని పరుగులు పెట్టింది అరియానా. అరియానా భయంతో వణికి పోతుంటే బయట సొహైల్, హారికలు మాస్ స్టెప్పులతో ఇరగదీశారు.అఖిల్, సొహైల్‌లను ఇద్దర్నీ పిలిచి అసలు సిసలు హర్రర్ సినిమా చూపించేసింది జలజ దెయ్యం... నోటికి వచ్చినట్లు ఏదేదో అన్నారు.. దానికి కోపం వచ్చిన దెయ్యం ఇద్దరిని ఫుడ్ బాల్ ఆడుకుంది.బయటకు వచ్చిన తరువాత అఖిల్, సొహైల్‌‌లు బిగ్ బాస్ కెమెరా ముందుకు వచ్చి.. అమ్మ బాబోయ్ డుర్రుమనిపించారు.. బై మిస్టేక్ కూడా ఈ వీడియో ఎక్కడా ప్లే చేయకండి.. మా ఇజ్జత్ పోతుంది.. చుడటానికీ కండలు ఉన్నాయి కానీ, భయపడి పోయాం.. అంటూ వారిద్దరూ భయపడిన ఎపిసోడ్ ప్రేక్షకులను ఓ విధంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ లో జలజ దెయ్యం మరొకరిని టార్గెట్ చేసిందని తెలుస్తుంది.. ఎది ఏమైనా ఈ రోజు ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: