బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే షో ఏదన్నా ఉంది అంటే అది ఒక్క బిగ్ బాస్ షో అనే చెప్పాలి. అయితే ఈ షో రాను రాను మరి ఆసక్తిగా మారింది. అసలు  బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అన్నది పెద్ద చర్చగా ఉంది. ఇంకా మిగిలింది కేవలం  రెండు వారాలు మాత్రమే. అంటే ఇంకా ఉన్నవి రెండే రెండు ఎలిమినేషన్స్ అన్నమాట. టాప్ ఫైవ్ కి అయిదుగురు వెళ్తారు. మరి ఆ ఇద్దరూ ఎవరూ అన్నది హాట్ హాట్ డిస్క‌షన్. బిగ్ బాస్ లో ఇప్పటిదాకా హౌస్ నుంచి వెళ్ళే పేర్లలో ఎక్కువగా వినిపించింది  అవినాష్ పేరే.  అయితే గత వారమే అవినాష్ ఎలిమినేట్ అయి ఎవిక్షన్ పాస్ తో హౌస్ లో కొనసాగుతున్నాడు. ఈ  వారం  మాత్రం అవినాష్ కచ్చితంగా ఇంటికి వెళ్తారని అందరు  అనుకుంటున్నారు.

కానీ అవినాష్ విషయంలో జబర్దస్త్ నుంచి ఫుల్ సపోర్ట్ గా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు కూడా అవినాష్ కాకుండా  ఇపుడు అభిజిత్ వైపు టర్న్ తీసుకున్నారు. అభిజిత్ కచ్చితంగా విన్నర్ అవుతాడని నాగబాబు అనడంతో ఆయనతో పాటే  జబర్దస్ట్ టీం లీడర్స్, అవినాష్ ఫ్రెండ్స్ కూడా  అతనికి యాంటీ అయ్యారు.  అయితే అవినాష్ కి సపోర్ట్ గా  సీనియర్ హీరో సాయికుమార్ మద్దతుగా నిలిచాడు.  అవినాష్ తన కుటుంబ సభ్యుడు అంటూ మాట్లాడారు. అవినాష్ పెర్ఫార్మెన్స్ బాగుందని, అందరూ అతనికి ఓటు చేయాలని కూడా గట్టిగా కోరారు.మంచి హాస్యాన్ని పండించే అతను అవినాష్ అని, నలుగురిని నవ్వించడానికి చూస్తాడు అని అన్నారు.

దీంతో అవినాష్ కి హౌస్ బయట మంచి మద్దతు దొరికింది. అయితే ఇది సరిపోతుందా అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే అవినాష్ డేంజర్ జోన్ లో ఉన్నాడు.మరి బిగ్ బాస్ ఏమైన బిగ్ ట్విస్ట్ ఇచ్చి మరొకరిని ఎలిమినేట్ చేస్తే అవినాష్ ఈ వారం హౌస్ లో ఉంటాడు. లేకపోతే మాత్రం 13వ‌ వారం ఇంటికి రావలిసిందే.. మరి బిగ్ బాస్ ఇంటిలో ఏమి జరుగుతుందో వేచి  చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: