బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో అంటే ప్రేక్షకులకు మహా ఇష్టం. ప్రస్తుతం బుల్లితెరలో టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్న షో ఏదన్నా ఉంది అంటే అది ఒక్క జబర్దస్త్ అనే చెప్పాలి. ఈ షో వల్ల చాలామంది ఆర్టిస్టుల జీవితాలు మారిపోయాయి. ఎంతోమంది టాలెంట్ ఉన్నాగాని ప్రోత్సాహం లేక  అట్టడుగున ఉండిపోతున్నారు. అలాంటి వారికీ జబర్దస్త్ ఒక అవకాశం ఇచ్చింది. జబర్దస్త్ స్టేజి మీద తమ టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. ఒక పక్క జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూనే మరోపక్క ఈవెంట్స్ లో, సినిమాల్లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు మన కమెడియన్స్. అయితే అసలు జబర్దస్త్ షో లో నటిస్తే ఎవరికీ ఎంత పారితోషకం వస్తుందనే విషయాల మీద ఎవరికీ క్లారిటీ అనేది లేదు. జబర్దస్త్ లో నటించే  కమెడియన్‌లకు లక్షల్లోనే పారితోషికాలు ముడతాయని అప్పట్లో చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు చెప్పుకొచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితమే మరోసారి అందరికీ  పారితోషకాన్ని  డబుల్ చేసారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ షోలో  వచ్చే రెమ్యునరేషన్స్ గురించి అప్పారావు కొన్ని షాకింగ్ నిజాలు బయట పెట్టాడు. అప్పారావు తో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ... మీకు జబర్దస్త్ లో పారితోషకం భారీగానే వస్తుందంట కదా.. ఒక షో కి ఎంత తీసుకుంటున్నారు.. అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు అప్పారావు కాస్త  తటపటాయిస్తూనే కొన్ని  నిజాలు బయటకి  చెప్పాడు.

 జబర్దస్త్ పుణ్యమా అని అందరం  బాగానే సంపాదించుకుంటున్నామని, డబ్బుతో పాటు పేరు, ప్రఖ్యాతలు కూడా బాగానే వచ్చాయని చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ ఒక్కటే కాకుండా,  ఈవెంట్స్ లో కూడా అవకాశాలు వస్తుంటాయని,  వాటిని బట్టి ఇచ్చే  రేట్ కూడా ఉంటుందని చెప్పాడు అప్పారావు. ఎప్పుడన్నా బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు ఒకరోజు అంతా  జర్నీకే పోతుందని, అప్పుడు దానికి కూడా రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు ఈయన. ఏ ఈవెంట్ అయినా  కూడా నేను (అప్పారావు) లేకుండా ఉండదు అనే పేరు అయితే తెచ్చుకున్నానని.. దానికి సంతోషంగా ఉందంటున్నాడు ఈ సీనియర్ కమెడియన్. ఇక పారితోషికం విషయంలో కూడా అందరికంటే ఎక్కువ కాదు కానీ అందరితో పాటుగానే భారీగా వస్తుందని ఒప్పుకున్నాడు.

ప్రస్తుతం జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లకు తనకంటే అత్యధికంగా రెమ్యునరేషన్ వస్తుందని తెలిపాడు అప్పారావు.అంతేకాదు అప్పారావు కూడా  టీం లీడర్ కాబట్టి తనకు కూడా లక్షల్లోనే రెమ్యునరేషన్ వస్తుందని చెప్పకనే చెప్పాడు మన అప్పారావు. అంతేకాదండోయ్ లాక్‌డౌన్ సమయంలో కూడా షెడ్యూల్స్ ప్రకారం డబ్బులు కూడా మాకు ఇచ్చారని తెలిపారు. డబ్బుల విషయంలో మాత్రం మల్లెమాల  పర్ఫెక్ట్ అంటున్నాడు ఈ కమెడియన్.. !! ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని అంటారు కదా... ఐడియా మాట ఏమో గాని జబర్దస్త్ షో మాత్రం ఎంతోమంది జీవితాలను మార్చేసింది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: