ష‌కీలా గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు చెప్పవలసిన అవసరం లేదు . ఒకానొక స‌మ‌యంలో ఆమె పేరు మార్మోగిన సందర్భాలు కూడా మనకి తెలుసు .. ఆమె సినిమా విడుదలకి సిద్ధం అయ్యిందంటే  స్టార్ హీరోలు సైతం త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకునేవారట‌. ఇక ఆమె న‌టించిన ప్ర‌తి చిత్రం నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్లకు కాసులు వర్షం కురుపించేవట ‌. కాగా అంత‌లా క్రేజ్‌ను సంపాదించుకున్న ష‌కీలా.. ఆ త‌రువాత ఉన్న‌ట్లుండి ఢీలా ప‌డిపోయారు. ఆమె స‌క్సెస్‌ని చూడ‌లేకనే కొంత‌ మంది స్టార్ హీరోలు ఆమెను తొక్కేశార‌ని ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికీ టాక్ న‌డుస్తూ ఉంటుంది. ఇక ఆ త‌రువాత సినిమాల్లో చిన్నచిన్న పాత్ర‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు ష‌కీలా. ఇక ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుగులు ఉన్నాయి.  ఇదిలా ఉంటే తాజాగా ఆమె  అలీ వ్యాఖ్య‌తగా  అలీతో స‌ర‌దాగా ప్రోగ్రామ్‌లో న‌టి అనురాధ‌తో పాటుకలిసి  పాల్గొన్నారు.. దీనికి సంబంధించిన ప్రోమో కూడా యూట్యూబ్ లో  విడుద‌ల అయ్యింది. ఇక అందులో షకీలను అలీ  మ‌హాన‌టి, డ‌ర్టీ పిక్చ‌ర్ సినిమాలు చూశారా..? అని ప్రశ్న వేశారు .. దానికి  చూశాను అని చెప్పిన ష‌కీలా.. డ‌ర్టీపిక్చ‌ర్‌ని ప‌క్క‌న‌పెట్టండి, ఎందుకంటే నాకు సిల్క్ స్మిత అంటే ఇష్టం లేదు అని నిర్మొహమాటంగా చెప్పింది.

ఇక తనతో  నటించిన వారందరు  ఇప్ప‌టికీ మాట్లాడుతుంటార‌ని ష‌కీలా తెలిపింది. కాగా ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో   టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు కాల్ చేసి.. ఎలా ఉన్నావ‌మ్మా అని అడగగా ఆ మాట విని ఆశ్చర్యపోయానని .. అది విన‌గానే త‌న‌కు ఏడుపు వ‌చ్చింద‌ని ష‌కీలా తెలిపింది .  అయితే షకీలా జీవిత కథ ఆధారంగా హిందీ లో తెరకెక్కిన షకీలా మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది.గతంలో సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా డర్టీ పిక్చర్ చిత్రం రాగా ఇటీవలే మరో శృంగార తార షకీలా చిత్రం కూడా వచ్చింది.. మొత్తంగా చూస్తే  హిందీ లోనే వీరిద్దరి చిత్రాలు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు ..

మరింత సమాచారం తెలుసుకోండి: