బిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అంతే కాదు సొంతంగా ఇల్లు, కార్లు కొని సెటిల్ అయ్యారు. ఎన్నో విమర్శలు కూడా అందుకున్నారు. చాలా మంది ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొన్నా రు . తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ సీరియల్ నటి హిమజ ఈ మధ్య కాలంలో లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ బెంజ్ కార్, సొంత ఇంటిని కొనుగోలు చేయడంతో ఆమెపై రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే వీటన్నింటినిపై ఘాటుగా రియాక్ట్ అవుతూ.. అసలు తన బ్యాగ్రౌండ్ ఏంటో చెప్తూ తనపై కారు కూతలు కూసేవారి నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. 



తనకు బెంజ్ కారు కొనడానికి కావలసిన డబ్బు లు ఎక్కడి నుంచి వచ్చాయి. అనే విషయాలను గురించి క్లారిటీ ఇచ్చింది. అమ్మాయి ఎలా కష్టపడుతోంది అనేది ఎవ్వరూ చూడరు. ఆ అమ్మాయికి కారు ఎలా వచ్చింది.. ఎవరు కొనిచ్చారు అని ఆలోచిస్తారు.నేను సీరియల్స్ కష్టపడి చేస్తున్నా.. సినిమాలు అయితే ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వెళ్లి చేస్తా.. బిగ్ బాస్ హౌస్‌లో ఎంత కష్టపడ్డామో చూశారు.. ఎంత మెంటల్ స్ట్రగుల్ ఉంటుందో చూశారు.. ఇవన్నీ చేస్తున్నాం అంటే బాగా సంపాదిస్తున్నారు అంటే వాటిని కూడా కోనుకుంటారు కదా..



ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం అంటే లోన్లు ఇవ్వరా?? మేం కారు కొనుక్కోలేమా?? ఇళ్లు కొనుక్కోలేమా?? నా ముందు ఇప్పుడు బెంజ్ కారు ఉందని అంటున్నారు కానీ.. నా కష్టాన్ని చూడరా?? బెంజ్ కారు కొనడం కాదు.. దాన్ని మెయిన్ టైన్ చేయాలంటే ఎంత కష్టపడాలన్న భయం, భక్తి ఉంటాయి. అందుకే ఇంకో రెండు పనులు ఎక్కువ చేస్తాను.అలాంటి వాటిని ఎవరూ గుర్తించరు. ఎవరైనా ఎదుగుతున్నారు అంటే పుల్లలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఇప్పటికైనా మానేసి.. వీలైతే సపోర్ట్ చెయ్యండి అంటూ హిమజ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: