బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర లేదు. ఈ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక షో నాలుగు సీజన్స్ విజయవంతగా పూర్తి చేసుకుంది. ఇక షోకి మొదటి సీజన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యహరించారు. ఇక మొదటి సీజన్ లో విన్నర్ గా శివ బాలాజీ నిలిచారు. ఇక రెండో సీజన్ లో ఈ షోకి హోస్ట్ గా నాని వ్యవహరించారు. ఇక రెండో సీజన్ లో కౌశాల్ నిలిచారు.

అయితే బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లు ఒక్క ఎత్తు అయితే మూడు, నాలుగు సీజన్లు ఓ రేంజ్ అని చెప్పాలి. ఈ రెండు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ లో రాహుల్ విజేతగా నిలవగా.. నాలుగో సీజన్ లో విన్నర్ గా అభిజిత్ నిలిచారు. అయితే ఐదో సీజ‌న్‌ని కూడా త్వ‌ర‌లోనే ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు అనుకుటుతున్నారని సమాచారం. ఈ తరుణంలో దీనికి సంబంధించి ఇప్ప‌టికే పనులు ప్రారంభం చేసిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గ‌త సీజ‌న్ల‌కు భిన్నంగా ఈ సీజ‌న్‌ని గ్రాండ్‌గా చేయాల‌నుకుంటున్నార‌ట నిర్వాహ‌కులు. ఈ క్ర‌మంలో ఖ‌ర్చు ఎక్కువైనా ప‌ర్వాలేదు కంటెస్టెంట్‌ల విష‌యంలోనూ రాజీ ప‌డ‌కూడ‌దని వారు అనుకుంటున్నార‌ట‌.

ఇక నాలుగో సీజన్ లో మొదట రేటింగ్ తక్కువనే వచ్చింది. ఇక రోజురోజుకు అభిమాలకు షోపై ఆసక్తి పెరడగంతో విభిన్నమైన రేటింగ్ తో దూసుకెళ్లింది ఈ షో. ఈ సీజనల్ లో పాల్గొన్న కాంటెస్టులకు మంచి గుర్తింపు లభించింది. ఇక ముందు సీజనల్ లో పాల్గొన్న వారికంటే ఎక్కువగా లబ్దిపొందింది నాలుగోవ సీజన్ వాళ్లే అని చెప్పాలి. ఇక ఈ షోలో పాల్గొన్న  సొహైల్, మోనాల్ ఇప్ప‌టికే బిజీ అయిపోగా.. మెహ‌బూబ్, దివి, స్వాతి దీక్షిత్‌ల‌కు కూడా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. అలాగే మిగిలిన వారికి కూడా ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: