బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్  షో అంటూ మొదలైంది.. అది కాస్త రొమాన్స్, బూతు మాటలకు కేరాఫ్ గా నిలిచింది. ఈ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. సెలబ్రిటీలు గా మారి వరుస సినిమాల లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ నాలు గో సీజన్ లో వాళ్ళు మాత్రం బాగా ఫేమస్ అయ్యారు.మొన్నటికి మొన్న 100 పర్సెంట్ లవ్ అంటూ రీల్ జంటలు, రియల్ జంటలకు మధ్య పోటీలు పెట్టి ఓ ఈవెంట్ చేశారు. అందులో ఏకంగా ఓ జంటకు నిశ్చితార్థం జరిపించేశారు.



అవినాష్ అరియానాలు బిగ్ బాస్ షోలో చేసిన రచ్చను ఎవ్వరూ మరిచిపోలేదు. బిగ్ బాస్ టీం కూడా ఈ జంటపై బాగానే ఫోకస్ పెట్టింది. ఈ ఇద్దరి ట్రాక్‌ను జనాల్లోకి బాగానే తీసుకెళ్లారు. అలా ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు ఆ క్రేజ్‌ను వాడేసుకుంటున్నారు.అవినాష్ అరియానాల కెమిస్ట్రీ హైలెట్ అవుతోంది. బయటకు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నా.. తెర మీదకు వచ్చే సరికి మాత్రం ఓ రేంజ్‌ లో కెమిస్ట్రీని పండిస్తుంటారు. ప్రేమ జంటలా నటిస్తుంటారు. అది నటనో నిజమో తెలియనంతగా జీవించేస్తుంటారు..100 పర్సెంట్ లవ్ షోలో నూ ఇద్దరూ అలానే చేశారు. ఆ ఇద్దరి రొమాంటిక్ పర్ఫామెన్స్ చూసిన అందరూ షాక్ అయ్యారు.


సుమ నిర్వహిస్తోన్న స్టార్ట్ మ్యూజిక్ షోలో అవినాష్ అరియానాలు గెస్ట్‌లుగా వచ్చారు. అలా ఊరికే వస్తే ఆ షోకు ఎలా హైప్ వస్తే ఏం ఉంటుందని అనుకున్నారో ఏమో గానీ. ఓ స్క్రిప్ట్ రెడీ చేసేశారు. అరియానానే అవినాష్‌కు ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఓ ప్రోమోను వదిలారు. రింగ్ పట్టుకొచ్చింది అరియానా. అవినాష్ ముందు మోకాళ్ల మీద నిల్చుని ప్రపోజ్ చేసినట్టుంది. అయితే ప్రోమో చూస్తుంటే అక్కడే ఏదో ఎంగేజ్మెంట్ అయినట్టు కనిపిస్తోంది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: