తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రేంజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే.. దేశవ్యాప్తంగా ఈ షో కి ఉన్న క్రేజ్ ఏ షో కి లేదు.. సీజన్ ల పరంగా వస్తున్న ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.. తెలుగులో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో  ఐదో సీజన్ కి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక నాల్గో సీజన్ అయిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ల అల్లరి మాత్రం తగ్గడమే లేదు. సోషల్ మీడియా లో వారు పెట్టె పోస్ట్ లు చూస్తుంటే ప్రేక్షకులు తమని మర్చిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు అనిపిస్తుంది.

మరోవైపు గంగవ్వ కూడా తన శక్తి మేరకు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది ఊహించని రీతిలో పాపులర్ అయిపోయారు. అందులో చాలా మంది టాప్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో సహజ నటి గంగవ్వ ఒకరు. చాలా కాలంగా వైవిధ్యమైన వీడియోలతో సందడి చేస్తోన్న ఆమె.. ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతున్నారు. ఇక, ఇటీవలే బిగ్ బాస్ షోలోనూ పాల్గొన్న ఈ పెద్దావిడ.. ఆ నిర్వహకుల సహకారంతో కొత్త ఇంటిని కూడా నిర్మించుకోగలిగారు. ఇలాంటి పరిస్థితుల్లో గంగవ్వ తాజాగా ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆమెకు ఏమైంది అని ఆమె అభిమానులు వాపోతున్నారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటి పనులతో పాటు ఎప్పటి లాగే వీడియోలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు గంగవ్వ. అంతేకాదు, గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సీనియర్ నటి ఆస్పత్రిలో చేరారు. దీనికి సంబంధించిన ఫొటో వైరల్ అవడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం గంగవ్వ తన మోకాళ్ల నొప్పులకు చికిత్స తీసుకునేందుకు ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు ఆమెకు ట్రీట్‌మెంట్ చేస్తోన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘మోకాళ్ళ నొప్పులకు ఆయుర్వేద వైద్యం చేపించుకున్నా. కొత్త వీడియో అచ్చింది చూడుర్రి' అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఇది తెలియని వాళ్లంతా ఆమెకు ఏదో అయిందని టెన్షన్ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: