సోషల్ మీడియా వీడియోలతో ప్రేక్షకులను ఉర్రుతలూగించిన అషురెడ్డి ఎంతో మంది ఫాన్స్ ని ఏర్పరుచుకుని అందరిని ఫిదా చేస్తూ వచ్చింది. జూనియర్ సమంత గా ఆమె పేరు తెచ్చుకుని అది తర్వాత బిగ్ బాస్ లో కూడా పాల్గొని అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు కూడా సెలెబ్రిటీలు అవుతున్న రోజులివి.. ఇలాంటి టైం లో కొంచెం టాలెంట్ ఉన్నా ఫ్యాన్స్ అయిపోతారు. అలా అషురెడ్డి కూడా తన క్యూట్ క్యూట్ వీడియోలతో మంచి ఫేమ్ ని దక్కించుకుని బిగ్ బాస్ లో సోషల్ స్టార్ గా ఎంటర్ అయ్యింది.

అక్కడ తనదైన అల్లరి చేష్టలతో అమాయకత్వం తో ప్రేక్షకులకు ఇంకాస్త దగ్గరైంది.. అయితే బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక మాత్రం ఆమె సోషల్ మీడియా లో కనపడడం ఎక్కువ చేసింది.. అంతేకాదు వార్తల్లో కూడా ఎక్కువ గా నిలుస్తూ ప్రజలు మర్చిపోకుండా చేస్తుంది.. రాహుల్ తో ఎఫైర్ అంటూ ఆమధ్య రచ్చ చేసిన ఈ భామ ఈసారి ఏకంగా హద్దులు దాటేసినట్లు తెలుస్తుంది..ఈమధ్య  ఎంటర్టైన్మెంట్ పేరిట డబుల్ మీనింగ్ డైలాగ్స్, హగ్గులు, కిస్సులతో రెచ్చిపోతున్నారు. టీవీ నిర్వాహకులు..

బుల్లితెరపై జబర్దస్త్ షోనే కింగ్‌లా ఉండేది. అందులో ఎంతటి డబుల్ మీనింగ్ డైలాగ్‌లున్నా కూడా ముద్దుల వరకు వ్యవహారం వెళ్లలేదు. అందరూ లేడీ గెటప్ ఆర్టిస్ట్‌లతోనే స్కిట్లను కానిచ్చేవారు. కానీ ఈ మధ్య మాత్రం బుల్లితెరపై మీద కూడా రొమాన్స్ హద్దులు దాటుతోంది.బిగ్ బాస్ కంటెస్టెంట్లు, అదిరింది టీంతో కలిసి కామెడీ స్టార్స్‌ను గ్రాండ్‌గానే లాంచ్ చేశారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు పోటీగా వచ్చిన ఈ షో బాగా క్లిక్ అయింది. అయితే ఇందులో అషూ, అరియానా, అవినాష్‌లు చేసే హంగామా మాత్రం అంతా ఇంతా కాదు.బుల్లితెరపై సక్సెస్ అవ్వాలంటే ఓ ట్రాక్ ఏర్పడాలి. అందుకే గత వారం ఎపిసోడ్‌లో ఫ్లోర్ మీద జారుతూ ఉండగా.. ఆమె కోసం ఎక్స్ ప్రెస్ హరి, అవినాష్ ఇలా అందరూ రెడీగా ఉన్నారు. ఇక అషూ కూడా కావాల్సినంత గ్లామర్‌ను ఒలకబోస్తోంది. అయితే వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో అషూ రెడ్డి రెచ్చిపోయింది. ఎక్స్ ప్రెస్ హరితో రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయడమే కాకుండా.. హగ్ చేసుకుంది.. అంతటితో ఆగకుండా.. ముద్దు కూడా పెట్టేసింది. ఆమె అలా ముద్దు పెట్టేయడంతో శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: