టీవీ షో లు ఇప్పుడు సినిమాలను మించిన రేంజులో రచ్చ చేస్తున్నాయి. సినిమాలో సందర్భాన్ని బట్టి డైలాగులు ఉంటాయి, సాంగ్ బట్టి ముద్దులు, హగ్గులు ఉంటాయి. వాటికి ఘాటు ఎక్కువైందని విమర్శకులు అంటున్నారు. అయితే బుల్లి తెరపై కామెడీ పేరుతో వస్తున్న షో లు మాత్రం డబుల్ మీనింగ్ డైలాగులు, కెమెరాల ముందు ఘాటు రొమాన్స్.. ఇవన్నీ చూస్తుంటే రేటింగ్ కోసం ఛానెల్స్ ఎంతవరకైనా పోతాయి అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు..


విషయానికోస్తే..ఎంటర్టైన్మెంట్ పేరిట డబుల్ మీనింగ్ డైలాగ్స్, హగ్గులు, కిస్సులతో రెచ్చిపోతున్నారు. ప్రతీ ఒక్కరూ తమ తమ టీఆర్పీలను పెంచుకునే క్రమంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. లవ్ ట్రాక్‌లను జొప్పిస్తున్నారు.. లేని ప్రేమను వారి మధ్య పుట్టించి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.ప్రస్తుతం కామెడీ స్టార్స్ షో శ్రుతి మించిపోయినట్టు కనిపిస్తోంది.ఇప్పటికే బుల్లితెరపై జబర్దస్త్ షోనే కింగ్‌లా ఉండేది. అందులో ఎంతటి డబుల్ మీనింగ్ డైలాగ్‌లున్నా కూడా ముద్దుల వరకు వ్యవహారం వెళ్లలేదు. అందరూ లేడీ గెటప్ ఆర్టిస్ట్‌లతోనే స్కిట్లను కానిచ్చేవారు. కానీ ఈ మధ్య మాత్రం బుల్లితెరపై మీద కూడా రొమాన్స్ తారాస్థాయికి చేరుతుంది.



బిగ్ బాస్ కంటెస్టెంట్లు, అదిరింది టీంతో కలిసి కామెడీ స్టార్స్‌ను గ్రాండ్‌గానే లాంచ్ చేశారు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు పోటీగా వచ్చిన ఈ షో బాగా క్లిక్ అయింది. అయితే ఇందులో అషూ, అరియానా, అవినాష్‌లు చేసే హంగామా మాత్రం మాములుగా లేదు..అవినాష్, అరియనాలు మాత్రం వారి మద్య ఏదో ఉంది అనే విధంగా వింత స్కిట్స్ చేస్తూ వస్తున్నారు. దాంతో జనాలకు అనేక అనుమానాలు కలిగిస్తున్నారు.గత వారం ఎపిసోడ్‌లో ఫ్లోర్ మీద జారుతూ ఉండగా.. ఆమె కోసం ఎక్స్ ప్రెస్ హరి, అవినాష్ ఇలా అందరూ రెడీగా ఉన్నారు. ఇక అషూ కూడా కావాల్సినంత గ్లామర్‌ను ఒలకబోస్తోంది. ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కాస్త హాట్ వెదర్ ను క్రియేట్ చేస్తుంది.ఎక్స్ ప్రెస్ హరితో రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయడమే కాకుండా హగ్ చేసుకుంది.. అంతటితో ఆగకుండా ముద్దు కూడా పెట్టేసింది. ఆమె అలా ముద్దు పెట్టేయడంతో శేఖర్ మాస్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: