కాస్టింగ్ కౌచ్ మీద టాలీవుడ్ లో దుమారం రేపింది నటి శ్రీరెడ్డి..ఓ నార్మల్ నటిగా ఉన్న ఆమె క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా తమిళనాడు లో సెటిల్ అయ్యింది.. గత జీవితం తాలూకు ఫలితం ఎలాంటి ప్రభావాన్ని తనపై చూపించకూడదని తమిళనాడు లో ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని డబ్బు సంపాదన మొదలుపెట్టింది.. వెళ్లడం అయితే వెళ్ళింది కానీ శ్రీరెడ్డి టాలీవుడ్ సెలెబ్రిటీలను విమర్శించడం మాత్రం మానుకోలేదు.. టైం దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ని, మెగా ఫ్యామిలీ ని విమర్శిస్తూ తన నోటికి పనిచెప్తూ మెగా ఫ్యాన్స్ నోటికి పని చెప్తుంది..

తనను ఎవరు అనేవరకు తాను ఎవరిని ఏమీ అనను అనిచెప్పే శ్రీరెడ్డి ఎలాంటి కారణం లేకుండానే పవన్ పై నోరుజారుతుంది. ఇదిలా ఉంటే ఆమె తెలుగు బిగ్ బాస్ కి ఓకే చెప్పినట్లు వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి.  తెలుగు, అటు త‌మిళ్‌లో ఐదో సీజ‌న్‌కి సంబంధించిన ఏర్పాట్లు మొద‌లైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ రెండు భాష‌ల్లో కంటెస్టెంట్ల కోసం ఇప్పుడు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు టాక్. అంతేకాదు కొంత‌మందితో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు కూడా స‌మాచారం. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ వివాదాస్పద న‌టి శ్రీ రెడ్డిని బిగ్‌బాస్ కోసం సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. అయితే తెలుగు బిగ్‌బాస్ కోసం కాదు త‌మిళ్ బిగ్‌బాస్ కోసం.

త‌మిళ్‌లో బిగ్‌బాస్‌కి క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్య‌తగా చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే అక్క‌డ బిగ్‌బాస్ 5ను ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు అనుకుంటున్నారు.ఈ క్ర‌మంలో కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో శ్రీరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. గ‌త రెండేళ్లుగా చెన్నైలో ఉంటోన్న ఈ న‌టిని బిగ్‌బాస్‌లోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ అంటేనే కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్. అందుకే వివాదాస్ప‌ద న‌టుల‌ను తీసుకునేందుకు నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు త‌మిళ బిగ్‌బాస్ నిర్వాహ‌కులు శ్రీరెడ్డిని బిగ్‌బాస్ 5లోకి తీసుకోబోతున్న‌ట్లు టాక్. ప‌క్క భాష వారికి కూడా బిగ్‌బాస్‌లో చోటు ఇస్తూ ఉండ‌గా.. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు త‌మిళ బిగ్‌బాస్‌లో శ్రీరెడ్డికి ఛాన్స్ ఇవ్వ‌బోతున్న‌ట్లు టాక్. మ‌రి ఇందులో నిజ‌మెంతె తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వారం ఆగాల్సిందే.





మరింత సమాచారం తెలుసుకోండి: