పలు యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అరియానా.. ఆ తర్వాత బిగ్ బాస్ లో పేరు తెచ్చుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకుంది. ఈ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయిన అరియనా ఇప్పుడు పెద్ద సెలబ్రిటీ.. తొలుత సాధారణ యాంకర్ గా ఉన్న అరియనా బిగ్ బాస్ తో ఒక్కసారిగా స్టార్ యాంకర్ అయిపొయింది.. జెమినీ మ్యూజిక్ లో, పలు యూట్యూబ్ ఛానల్స్ కి యాంకర్ గా చేసి ఆ తర్వాత RGV ఇంటర్వ్యూ తో ఫేమ్ తెచ్చుకుని ఒక్కసారిగా బిగ్ బాస్ లో అవకాశం తెచ్చుకుంది..అక్కడ అవినాష్ తో లవ్ ఎఫైర్, సోహైల్ వరమా అన్నీ ఆమెకు కలిసి వచ్చాయి.

ఈకోవలోనే బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది..ఆమె మరో కంటస్టెంట్ అవినాష్ తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..అయితే ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయాక కూడా  బయట కూడా అదేవిధంగా రచ్చ రచ్చ చేస్తున్నారు ఈ ఇద్దరు.. టాస్క్ లు, అభిమానం, ఆత్మస్థైర్యం విషయంలో అందరికి ఆదర్శంగా నిలవగా అరియనా టాప్ 5 లో నిలిచి బయటకి వచ్చింది. అయితే ఈమె జర్నీ లో ఎక్కువగా ఆకట్టుకుంది కమెడియన్ అవినాష్ తో ఫ్రెండ్షిప్..అవినాష్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఇద్దరు ఎంతో దగ్గరయ్యారు. ఒకానొక టైం లో ఈ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారా అన్న ఫీల్ ఆడియెన్స్ కి కలిగింది.

ఇక తాజగా ఆమె  ఓ వారం పదిరోజులు మీడియా లో కనిపించను.. ఈనెల 12 వరకు సోషల్ మీడియా లోకనిపించాను అంటూ చెప్పింది. ఎందుకంటే ఆమె హిమాలయాలకు వెళ్తుందట. అక్కడ ట్రెకింగ్ చేయడానికి ఒంటరిగా వెళ్తున్నాను అని చెప్పింది. అక్కడ ట్రెకింగ్ గ్యాంగ్ ఉంటుంది.. అయినా నేను ఒంటరిగానే వెళ్తున్నాను.. అక్కడ సిగ్నల్స్ ఉండవు.. అందుకే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండను.. అర్థం చేసుకోండి. ఈపదిరోజులు అక్కడి నుంచి వచ్చాక విశేషాలు చెప్తాను అని చెప్పింది. ఈఅమ్మడు ప్రస్త్తుతం రాజ్ తరుణ్ సరసన ఓ సినిమా చేస్తుంది.. అంతేకాదు మరిన్ని సినిమాలు కూడా ఆమె ఒప్పుకుందట.. అవినాష్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించబోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: