కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా భారీ పెరిగిపోతుంది.. ఊహకు అందని విధంగా కేసులు నమోదయ్యాయి.. మరణాల రేటు కూడా భారీగా పెరిగింది. సంబంధ బాంధవ్యాలను కూడా ఈ కరోనా వల్ల తుడిచి పెట్టుకు పోయాయి చనిపోయాక కనీసం ఎవరి చివరి చూపుకు కూడా నోచుకోని దీన స్థితిలో ఏర్పడింది. ఇకపోతే షూటింగ్ లు వాయిదా పడ్డాయి.. మరో వైపు బుల్లి తెరపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. రియాలిటీ షోలు అలాంటివి ఎవి అంటూ లేవు.


ఇకపోతే తెలుగు బిగ్ బాస్ ఫాన్స్ కి కరోనా చేదు వార్త తీసుకువచ్చింది. నిజానికి గత ఏడాది కరోనా కారణంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ చాలా ఆలస్యంగా మొదలైంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు ఈ ఏడాది ముందుగానే బిగ్ బాస్ లాంచ్ చేయాలని భావించారు. అందుకే షెడ్యూల్ ప్రకారం జూన్ నెల నుంచి ఈ షో మొదలు పెట్టాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఈ షో జూన్ నెలలో అస్సలు జరగదు..


తెలంగాణలో లాక్ డౌన్ విధించము అని ప్రభుత్వం చెబుతున్నా సరే ఇప్పటికే దాదాపు సినిమా షూటింగగులు నిలిచిపోయాయి. టీవీ సీరియల్ షూటింగ్ లు జరుగుతున్నా ఇతర రియాలిటీ షోల షూటింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో రావాల్సిన ఎవరు మీలో కోటీశ్వరులు షో కూడా ఈ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.ఈ ఐదవ సీజన్ కి కూడా మూడు, నాలుగు సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ షోకు అంత ఆదరణ నాగార్జున తీసుకువచ్చారని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ఈ సీజన్ కూడా ఆయన హోస్ట్ గా నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మొదటి సీజన్లో శివబాలాజీ విన్నర్ గా నిలువగా రెండో సీజన్లో మంద కౌశల్ విన్నర్ గా నిలిచారు. మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ లో అభిజిత్ లు విన్నర్ గా నిలిచి ప్రేక్షకుల  అభిమానాన్ని చూరగొన్నాడు..






మరింత సమాచారం తెలుసుకోండి: