బిగ్ బాస్ షో లో పాల్గొన్న కంటెస్టెంట్ లకు మంచి మంచి అవకాశాలు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి వారిపైనే పడింది.. తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్చరిత్ర ను శ్రీష్టించింది అని చెప్పొచ్చు.. దేశవ్యాప్తంగా ఈ షో కి ఉన్న క్రేజ్ ఏ షో కి లేదు.. ఈ షో వస్తుందంటే చాలు అభిమానులు ఫుల్ టైం పాస్ అని ఖుషి అవుతుంటారు.. సీజన్ ల పరంగా వస్తున్న ఈ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మొదలుపెట్టిన ఈ షో తెలుగులో నాలుగు సీజన్ లు పూర్తి చేసుకుంది.

ఈ షో  ఐదో సీజన్ కి ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక నాల్గో సీజన్ అయిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్ ల అల్లరి మాత్రం తగ్గడమే లేదు. సోషల్ మీడియా లో వారు పెట్టె పోస్ట్ లు చూస్తుంటే ప్రేక్షకులు తమని మర్చిపోకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నారు అనిపిస్తుంది.  ఈ సీజన్ లోంచి బయటకి వచ్చిన వారిలో ప్రాజెక్ట్ లతో బిజీ గా ఉంది మోనాల్ అని చెప్పొచ్చు..

మోనాల్‌ గజ్జర్‌ ఇప్పటికే అల్లుడు అదుర్స్‌లో ప్రత్యేక పాటలో మెరిసింది. మరో చిత్రంతో కూడా చర్చలు జరుపుతోంది. అంతేకాకుండా ఓ డాన్స్ షో లో కూడా జడ్జ్ గా చేస్తుంది. అయితే ఈ షో కి ఆమె ప్లస్ అవుతుంది అనుకుంటే మైనస్ అవుతున్ది ఆమెపై వచ్చే ట్రోల్ల్స్ ని బట్టి తెలుస్తుంది. ఆమెకి జడ్జ్ గా ఉండే అర్హత లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా డాన్స్ ప్లస్ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో మోనాల్ స్టేజ్ పైకి వెళ్లి ఓ కంటెస్టెంట్ తో కలిసి డాన్స్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు మోనాల్ ని మరింత టార్గెట్ చేశారు. మోనాల్ వలనే ఈ షో చూడడం మానేశామంటూ మండిపడుతున్నారు. అందరూ డాన్స్ మాస్టర్స్ జడ్జ్ గా వ్యవహరిస్తుంటే ఈమెను ఎలా తీసుకున్నారంటూ మోనాల్ ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: