టెలివిజన్ చరిత్రలో మరో రికార్డ్ ను బ్రేక్ చేసిన సీరియల్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మాత్రం కార్తీక దీపం. ఈ ధారావాహిక కథ అందరిని ఆకట్టుకోవడంతో ప్రేక్షాధారణ పొందింది. ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్స్ రోజుకో ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . 1040 ఎపిసోడ్‌లో భావోద్వేగాలు ఉప్పొంగాయి. దీప, తన పిల్లల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు కనిపించాయి. దీపతో పిల్లలు మాట్లాడుతూ... గతంలో విజయనగరం వెళ్లినట్టు ఇప్పుడు అందర్నీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతావా? అంటూ తల్లి దీపను హిమ అమాయకంగా ప్రశ్నించింది. ఎవరికీ చెప్పకుండా.. ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోతానా? అంటూ దీప మనసులో అనుకొంటూ మనో వేదనకు గురైంది

పిల్లలు ఇద్దరు కథ చెప్పాలని దీపను కోరారు. దాంతో దీప ఆవు కథను చెబుతుంది.. ఆవు , పులి అంటూ కథను ప్రారంభించింది. లి గాండ్రింపుకు తాను చచ్చిపోతానని భయపడలేదు. ఒకవేళ తాను చచ్చిపోతే దూడ ఒంటరి అవుతుందనే బెంగ మొదలైంది. ఆవు మీద దాడి చేసింది పులి. అతికష్టం మీద పులిని ఆవు ఆపింది. నాకు ఆహారం అవడానికి నీవు పుట్టావని ఆవును చూసి పులి అంది. అవును.. నీకు ఆహారం అవుతాను.. కానీ నాకు చివరి కోరిక ఉంది.. తీరుస్తావా అంటూ అడిగింది. దాంతో పులి సరే అంది అంటూ దీప కంటతడి పెడుతూ కథను చెప్పడం మొదలుపెట్టింది.

ఆకలితో ఉన్న ఎవరినీ బిడ్డ అది. నేను వెళ్లి పాలు ఇచ్చి వస్తానంది. అప్పుడు పులి కరిగిపోయి మళ్లీ రావాలని పంపించింది. ఆవు దూడ దగ్గరకు వెళ్లింది. తనవితీరా ముద్దులు పెట్టింది. కడుపు నిండా పాలు ఇచ్చింది అంటూ కన్నీరుమున్నీరవుతూ దీప కథను చెప్తుంది. కంటతడి  పెట్టుకుంటుంది. ఆ కాలంలో నిజాయితీగా వచ్చిన ఆవును పులి వదిలేసింది. కానీ ఈ కాలంలో పులి వదిలేస్తుందా? అంటూ దీప మౌనంగా రోదించింది. పులిలా పొంచి ఉన్న మృత్యువు తనను కాటేస్తే.. నా పిల్లలు ఏమౌతారో అంటూ దీప గుండె పగిలేలా రోదించింది. దీప ఏడ్పు యావత్ తెలుగు ప్రేక్షకులను శోకంలో ముంచేసింది. మరి దీప చనిపోవడం ఖాయమా? లేక ఎదిగా ట్విస్ట్ ఉందా అనేది రానున్న ఎపిసోడ్స్ లలో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: