నాటి నుంచి నేటి వరకు మంచి కథకు ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని, ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఈ వాక్యం రుజువైంది. పల్లెటూరి వారు ఖరీదైన కెమెరా తో సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎమోషనల్ గా  తెరకెక్కించారు.. ఇక ఈ సినిమాలో వారు పడే కష్టాలు ప్రేక్షకులకు హాస్యాన్ని తెప్పించాయి. అంతేకాకుండా అమాయకత్వం తో పాటు హాస్యంతో ప్రేక్షకులను చాలా బాగా మెప్పించారు ఈ చిత్ర మేకర్స్. అయితే ఇటీవల ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాగా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.


విడుదలైన మొదటి వారం తోనే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ప్రేక్షకులను గొప్పగా ఆకర్షిస్తోంది.. ఇంతకు ఆ సినిమా ఏంటని ఆలోచిస్తున్నారా ? అదే సినిమా బండి.. ఈ చిత్రం తాజాగా ట్రెండ్స్ జాబితాలో మొట్టమొదటి స్థానంలో నిలవడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే వస్తున్న క్రియేటర్స్ కి ఓటీటీ మంచి వరంగా మారింది.  ఇక  లఘు చిత్రాల దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల సినిమా బండి అనే చిత్రాన్ని తెరకెక్కించి నెట్ఫ్లిక్స్ లో విడుదల చేశారు..


ఇక ఈ చిత్రాన్ని ఫ్యామిలీ మాన్ సిరీస్ సృష్టికర్తలు నిర్మించారు. ఇంక ఇంత పెద్ద నిర్మాతలు ఈ సినిమాను నిర్మించడం తో ఈ సినిమాకు మరింత ఇమేజ్ దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక కథ బాగుండడంతో మూవీ దూసుకుపోతోంది. ఈ సినిమాలో నటీనటులు కొత్తవారైనప్పటికీ చాలా బాగా మెప్పించారు..

చాలా సింపుల్ పాయింట్ తో తీసిన ఈ సినిమాలో కావలసినంత ఫన్ ఉంది. అత్యంత సహజమైన వాతావరణంలో,  కెమెరాకి ఏమాత్రం అలవాటు లేని మొహాలతో, అసలు సినిమాటిక్ డ్రామా, ఎక్స్ప్రెషన్ ఏమీ అవసరం లేని సన్నివేశాలతో నింపేసిన సినిమా ఇది. అందుకే కావాల్సినంత వినోదం అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. హీరో హీరోయిన్ల ని వెతుకులాడే సన్నివేశం, హీరో-హీరోయిన్ ట్రైన్ ఎక్కి పారిపోవాలి అనుకున్న సీన్...హీరోయిన్ మధ్యలో ఎవరితోనో లేచిపోవడం. ఇలా ఒకదాని తర్వాత మరో సీన్ ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది..


మరింత సమాచారం తెలుసుకోండి: