టీవీ చూసే వారు ఎక్కువగా అనుకునే విషయం ఏమిటంటే , మనకు నచ్చిన సినిమా టీవీలో వస్తే ఎంత బాగుండు అని.. అయితే కొందరి దగ్గర ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ లు  ఉండడం వల్ల ,వారు తమకు నచ్చిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.కానీ టీవీలో చూస్తూ ఎంజాయ్ చేసేటప్పుడు వచ్చే మజా మరొకచోట రాదని అంటారు మరి కొంతమంది. ఇక అసలు విషయానికి వస్తే, చాలా మంది కరోనా కారణంగా, అందులోనూ లాక్డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమైపోయి ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ చూడడం మొదలుపెట్టారు.

ఇక ఇందులో ముఖ్యంగా ఓటీటీ వేదికగా సినిమాలను చూసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే కేవలం ఒకే ఒక్క క్లిక్ తో మనకు నచ్చిన ఎన్నో సినిమాలను చూడవచ్చు. అయితే ఇందులో వచ్చిన ఒక చిక్కు ఏమిటంటే, మనకు నచ్చిన జానర్ లో, ఏదైనా మనకు నచ్చిన సినిమాను లేదా ఒక వెబ్ సిరీస్ ను చూడాలంటే మాత్రం అది ఎక్కడుందో వెతుక్కోవడం కొంచెం కష్టం. ఇందుకోసం మీరు కొంత సమయాన్ని కేటాయించాల్సి కూడా వస్తుంది. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టబోతోంది నెట్ ఫ్లెక్స్. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ అయిన నెట్ ఫ్లెక్స్ లో మనకు నచ్చిన సినిమాలను చూడడానికి కొన్ని కోడ్ లను విడుదల చేశారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..


అయితే ఇటీవల నెట్ ఫ్లెక్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఒక ఫీచర్ సహాయంతో ఒక కోడ్ ను అప్లై చేసి , ఆ తర్వాత యూజర్స్ ఏ జానర్ లో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారో, ఆ సినిమాలు డైరెక్ట్ గా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఇందుకోసం మీరు ఈ ఫీచర్ను వినియోగించవచ్చు. నెట్ ఫ్లెక్స్ ప్రవేశపెట్టిన సీక్రెట్ కోడ్ లను మీరు కూడా ఉపయోగించాలి అని అనుకుంటే ముందుగా మీరు బ్రౌసర్ లోకి వెళ్లి నెట్ఫ్లిక్స్ కి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీకు నచ్చిన జానర్ పై క్లిక్ చేయాలి. యు ఆర్ ఎల్ కోడెల లో మీకు నచ్చిన జానర్ కోడ్ ను  ఎంటర్ చేసి సినిమాలను కూడా చూడవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: