జబర్దస్త్ లో టీం లీడర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు రాకేష్. చిన్న పిల్లలతో తన స్కిట్లను ప్రారంభించిన రాకేష్, ప్రస్తుతం టీం లీడర్ గా రోహిణి ,శాంతి లాంటి మంచి కమెడియన్ లను తన గ్రూప్ లో పెట్టుకున్న విషయం తెలిసిందే. మొదట్లో కంటే ఇప్పట్లో ఇతని స్కిట్ లు బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికీ తమ వ్యక్తిగత జీవితం ఉన్నట్లుగానే , రాకేష్ కూడా తన వ్యక్తిగత జీవితాన్ని గురించి , ఇటీవల త్వరలోనే ఈ టీవీలో సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే సందర్భంగా ఆచార్యదేవోభవ అనే ఒక షో ని నిర్వహించనున్నారు..ఈ షో కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయడంతో , ఇందులో పలువురు తమ జీవితాల్లో ఏం నష్టపోయారు ..ఎవరు వారిని కాపాడారు అనే విషయాలను గురించి వివరించారు..

ఈ నేపథ్యంలోనే రాకేష్  కూడా తను అనుభవించిన కష్టాలను తెలపడం జరిగింది.. ప్రోమోలో రాకేష్ మాట్లాడుతూ.. జబర్దస్త్ లో ఒకానొక సమయంలో నన్ను టీం లీడర్ నుంచి తీసేసారు.. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను.. అలా ఒక సారి కారు తో నేనే స్వయంగా చచ్చిపోవాలని చెట్టు కూడా గుద్దాను.. కానీ దేవుడు లాంటి చంటి అన్న నన్ను చేరదీసి ,నాలో మనోధైర్యాన్ని నింపి , ఇప్పుడు ఈ రోజు మీ అందరి ముందు టీం లీడర్ గా కొనసాగేలా చేశాడు.. చంటి అన్న నాకు దేవుడు.. నేను చంటి  అన్నకు జీవితాంతం రుణపడి ఉంటాను ..అంటూ రాకేష్ అనడంతో అందరూ కూడా చంటి ని శభాష్ అనడంతో పాటు రాకేష్ ని కూడా మెచ్చుకున్నారు..

ఇక వీరే కాదు.. ఆది తో పాటు మరో కమెడియన్ కూడా ఇండస్ట్రీలో తమకు సహాయం చేసిన గురువుల గురించి తలుచుకున్నారు.. ఇక ఈ ప్రస్తుతం ఈ ప్రోమో కాస్తా వైరల్ అవ్వగా, త్వరలోనే సెప్టెంబర్ 5వ తేదీన ప్రసారం కానున్న షో కోసం చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: