బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం జరిగిన నామినేషన్ల సమయంలో నానా రభస జరిగిన విషయం తెలిసిందే. ప్రియ లహరిని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ తనతో పెద్దగా కలవదు అని ఎప్పుడూ హౌస్ లోని మగవారి వెనకే తిరుగుతుందని టక్కున అనేసి బాంబు పేల్చింది. అంతకన్నా పెద్ద ఇష్యూ రవి, లహరి నైట్ లైట్స్ ఆఫ్ అయ్యాక బాత్రూం లో హగ్ చేసుకున్నారు అంటూ ఆరోపించడం వివాదం పీక్స్ కు చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రియ నోరు జారడంతో ఇంట్లో ఒక పెద్ద యుద్దమే జరిగింది. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా అదే గొడవ మళ్ళీ కంటిన్యూ అయింది. ప్రియ...రవిని లహరి యాంకరింగ్ కోసం నీ వెంట పడుతుందని తనకి ఎలా చెప్పాలో తెలియడం లేదని చెప్పింది.

కానీ రవి మాత్రం  ససేమిరా  ఒప్పుకోలేదు. నేను అనలేదు అంటూ వాదించాడు. ఈ అంశం వలన మరోసారి హౌస్ లో మాటల యుద్ధం జరిగింది. ఇక మరో వైపు ప్రియాంక లోబోపై పెద్ద ఆరోపణే చేసింది. కాజల్, సిరి, ప్రియ లతో కూర్చున్న ప్రియాంక లోబో నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ నింద వేసింది. నిన్న హాఫ్ ఫిట్ డ్రెస్ లో ఉన్నాను.  అలా కిచెన్ లో ఉన్న సమయంలో లోబో అలా హఠాత్తుగా వచ్చి చేయి లోపలికి పెట్టాడు అంటూ చాలా పెద్ద నింద వేసింది. అలా వారంతా మాట్లాడుకుంటున్న సమయం లోనే లోబో వచ్చి ప్రియాంకకు ఏదో సారీ కన్వే చేస్తున్నట్టు హగ్ చేసుకుని కూల్ అంటూ వెళ్లిపోయాడు. మరి ఇది నిజంగా ప్రియాంక చెప్పినట్టు చేసిన పొరపాటుకా మరేదైనా కారణమా అనేది తెలియలేదు.

ఇక ప్రియాంక చెప్పిందాంట్లోనూ నిజముందని అనలేము ఎందుకంటే ఆ సీన్ ఎక్కడా టెలికాస్ట్ అవలేదు. ఒకవేళ ఇది నిజమే అయితే శనివారం నాగ్ ఈ విషయంపై మాట్లాడి ఫుటేజ్ చూపించచి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అలాగే శనివారం తేలాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. రవి నిజంగానే ప్రియతో లహరి నా వెంట పడుతుంది అన్నాడా? అలాగే లహరి, రవిలు లైట్స్ ఆఫ్ అయ్యాక హగ్ చేసుకోవడం నిజమేనా ఇలా చాలా విషయాలు లెక్క నాగ్ సెట్ చేయాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: