కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతూ, మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.. ముఖ్యంగా ఈ సీరియల్ కోసం మగ, ఆడ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమయానికి టీవీల ముందు వాలిపోతుంటారు. ఇకపోతే ఈ సీరియల్ లో నటించే నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. డాక్టర్ బాబు, మోనిత, సౌందర్య, వంటలక్క.. ఇలా వివిధ రకాల పాత్రలు పోషిస్తూ , మంచి టిఆర్పి రేటింగ్ పొందుతున్నారు నటీనటులు..

ఇకపోతే ఈ సీరియల్ లో దీప , కార్తీక్ ల పాత్ర ప్రత్యేకమని చెప్పాలి.. వీరికి కూతురు గా సౌర్య , హిమా పాత్రలు కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ సీరియల్ లో చాలా కాలం నుంచి దీప -  కార్తీక్ పెళ్లి చేసుకున్న తర్వాత , అనుకోని మనస్పర్థల కారణంగా విడిపోయి దూరంగా ఉన్నారు. అయితే అప్పటి నుంచి దీప -  కార్తీక్ ఎప్పుడు కలుస్తారు అని.. ఎంతో మంది అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు..

అంతేకాదు సౌర్య , హిమ లు కూడా తమ తల్లిదండ్రులు కలుసుకోవాలని, చేసే ఆలోచన చాలా బాగుంది అని, వారిని ఎలాగైనా సరే కలపాలి అనే పట్టుదల-ప్రేమ బాగా ఆకట్టుకుంటుంది.. ఇప్పటివరకు జరిగిన కథ ఒక ఎత్తు అయితే ,ఇప్పుడు జరగబోతున్న కథ ఎంతో ఆకర్షణగా నిలిచింది. హిమ, సౌర్య పాత్రలు ..ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. చిచ్చరపిడుగులాగ మాట్లాడే ఈ పిల్లలు చిన్న వాళ్లతో నుంచి పెద్దవాళ్ల వరకూ అందరినీ బాగా ఆకట్టుకోవడం గమనార్హం.

ఇకపోతే వీరిద్దరి రెమ్యునరేషన్  విషయానికి వస్తే,  రోజుకు ఏడు వేల రూపాయలను అందుకుంటున్నారు. ఇక అందుకే ఈ పిల్లల పాత్రలు కూడా సీరియల్ లో హైలెట్ గా నిలిచాయి.. అంతేకాదు ఈ విషయం బయటపడటంతో సోషల్ మీడియాలో ఇది కాస్త చాలా వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: