బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యి అప్పుడే 22 రోజులు అవుతోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో 23వ ఎపిసోడ్‌లో నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. అలా నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్ తో ఇంటి సభ్యుల మాటల తూటాలతో బిగ్ బాస్ హౌజ్ దద్దరిల్లిపోయింది.  ఏకంగా ఈసారి ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ప్రియ, లోబో, విశ్వ, నట్ రాజ్, రవి, కాజల్, సిరి, యాని మాస్టర్ లు ఉన్నారు. నిన్నటి ఈ నామినేషన్ ప్రక్రియలో నట్ రాజ్ మాస్టర్ బిల్డప్ ఎక్కువయ్యింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే... లోబో పిచ్చి పరాకాష్టకు చేరింది అంటున్నారు మరికొందరు ప్రేక్షకులు.

దీనికి కారణం లేకపోలేదు ప్రియని నామినేట్ చేసి తనపై ఫైర్ అయిన లోబో మద్యలో జనాలు చూస్తున్నారు అంటూనే "ఐ డోంట్ కేర్ అబౌట్ జనాలు" అనడంతో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు. దాంతో అది చూసిన జనాలు we care about you లోబో...మా కేరింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో  ఓటింగ్ లో చూపిస్తాం  అంటున్నారట. ఇదిలా ఉంచితే...బిగ్ బాస్ లో నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యే వారిని ముందుగానే కాస్త నెగటివ్ గా చూపిస్తారన్న వార్తలు ఈ మధ్య చాలానే వచ్చాయి. అయితే ఈ లెక్క ప్రకారం ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యుడు లోబోనే నని  అంటున్నారు. ఇప్పటికే ఈ విషయం కొన్ని మీడియా సంస్థలకు కూడా లీకైనట్లు తెలుస్తోంది. అయితే లీక్ లను బట్టే ఎలిమినేషన్ లు జరుగుతుండడంతో అధిక ప్రాధాన్యత నెలకొంది.

మరి హౌస్ లో బెస్ట్ ఎంటర్ టైనర్ గా కొనసాగుతున్న లోబోను ఎలిమినతె చేస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.మరి ఇది కరెక్టేనా అంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ శనివారం నాగ్ తో పాటు మరో  హీరో కనిపించబోతున్నారని టాక్. ఈ వారం ఓ స్టార్ హీరో గెస్ట్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏమౌతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: