మూలపడిన సెలబ్రిటీలు అయినా పెద్దగా పాపులర్ కాని సెలబ్రిటీలు అయినా మంచి ఫామ్ లో ఉన్న సెలబ్రిటీలు అయినా ఒక్కసారి బిగ్ బాస్ హౌజ్ లో అడుగు పెట్టారు అంటే వారి క్రేజ్ అంతకంతకూ పెరిగిపోవడం ఖాయం. అందుకే బిగ్ బాస్ షో లో అవకాశం అంటే ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు సీజన్ 5 తో ప్రతి రోజూ మన ఇంట సందడి చేస్తోంది. ఇప్పటికే హౌజ్ నుండి సరయు, ఉమాదేవి, లహరిలు ఎలిమినేట్ అయ్యారు. ఈ ముగ్గురు హౌజ్ లో ఉన్నది తక్కువ రోజులే అయినా బాగానే పాపులర్ అయ్యారు. 

కాగా తాజాగా  లహరి కి యాంకర్ గా ఓ షోకి అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే  ఆ ప్రోగ్రామ్ షూటింగ్ మొదలు కాగా త్వరలో ఓ ప్రముఖ ఛానల్ లో ఆ షో ప్రసారం కానుందని చెబుతున్నారు. ఈ షో గురించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. మొదట్లో లహరి అంటే చాలా మందికి అస్సలు తెలియదు కానీ బిగ్ బాస్ లోకి వచ్చాక ఈ అమ్మడు హాట్ లుక్ తో అందర్నీ ఆకర్షించింది. పర్ఫార్మెన్స్ పెద్దగా లేకపోయినా తడి పొడి మాటలతోనే ప్రేక్షకులను ఆకర్షించింది. ఇక ప్రియ ఎలిమినేషన్ సమయంలో మెన్ టాపిక్ తీసి లహరి ఎప్పుడూ మెన్ తోనే బిజీగా ఉంటుంది అనడంతో లహరి మరింత పాపులర్ అయిందనే చెప్పాలి.

అదీకాక లహరి బిగ్ బాస్ కి వచ్చిందే యాంకర్ గా అవకాశాలు వస్తాయని అందులోనూ యాంకర్ రవితో క్లోజ్ నెస్ పెంచుకుంటే యాంకర్ గా మంచి ఛాన్స్ లు వస్తాయ్యన్నదే తన ప్రధాన లక్ష్యం గా అన్నట్టు కనిపించింది. అలాగే రూమర్లు బాగానే వినిపించాయి. ఈమె బయటకు వచ్చి పట్టుమని పదిరోజులు కూడా కాకముందే  ఇపుడు అనూహ్యంగా అప్పుడే ఈమెకు ఓ ప్రముఖ ఛానల్ లో ఓ షోకి యాంకర్ గా చేసే అవకాశం వచ్చిందని త్వరలో షూటింగ్ మొదలు కానుందని ప్రచారం మొదలవడం నిజంగా విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: