బిగ్ బాస్ సీజన్ 5 లో నిన్న నాగ్ గత వారం ఇంట్లో జరిగిన తప్పులకు ఇంటి సభ్యులను ఒక్కొక్కరిగా నిల్చో బెట్టి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. నాగ్ ఆగ్రహాన్ని చూసి హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇక నిన్న ఎలిమినేషన్ విషయానికొస్తే ఆరవ ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. ముందు నుంచి వార్తల్లో వింటున్న విధంగానే శ్వేత వర్మ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం ఆరు మంది ఇంటి సభ్యులు హౌజ్ నుండి ఎలిమినేట్ కాగా అందులో ఐదు మంది లేడీస్ కావడం గమనార్హం. సరయు, ఉమా దేవి, లహరి, .హమీద ఇక ఇపుడేమో శ్వేత వర్మ ఎలిమినేట్ అయ్యారు. మగవారిలో నట్ రాజ్ మాస్టర్ ఒక్కళ్ళే ఎలిమినేట్ అయ్యారు. ఇది చూస్తుంటే యాని మాస్టర్ చెబుతున్నట్లు మేల్ కంటెస్టెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నట్లు అనిపిస్తోంది.

గత వారం ఎలిమినేషన్ కి మొత్తం పది మంది నామినేట్ కాగా అందులో శ్వేతకి తక్కువ ఓటింగ్స్ రావడంతో ఆమె హౌజ్ నుండి బయటకు రాక తప్పలేదు. సండే ఎపిసోడ్ లో శ్వేత ఇంటి నుండి ఔట్ అయ్యారు. తను ఇన్నాళ్లు హౌజ్ లో పోగుచేసుకున్న మెమరీస్ ను ఏవీ  గా చూపిస్తారు నాగ్. ఆ ఏవీ కంప్లీట్ అయ్యాక ఒక్కొక్కరి గురించి చెప్పడం మొదలుపెడుతుంది శ్వేత. బిగ్ బాస్ హౌస్ లో ఏ కంటెస్టెంట్ కి దూరంగా ఉండాలి అని నాగ్ అడుగగా, శ్వేతా టక్కుమని రవి పేరు చెప్పి ఇతనికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి అంటుంది. హౌజ్ లో చాలా డేంజరస్ పర్సన్ ఎవరు అని అడగ్గా..  మానస్ పైకి చాలా అమాయకంగా కనిపిస్తాడు కానీ అతడు చాలా డేంజరస్  అని చెబుతుంది.

మానస్ ఆలోచనలను అస్సలు అంచనా వేయలేం అని చెబుతుంది. ఇక యూ టర్న్ ఎవరు తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు అని నాగ్ అడగగా... కాజల్ కు ఇది కరెక్ట్ గా సరిపోతుంది. కెప్టెన్సీ టాస్క్ లో కాజల్ యూ టర్న్ తీసుకుంది అంటూ చెబుతుంది. కానీ నువ్వు బాగా ఆడుతావ్ అంటూ చెప్పింది.. దీనిని బట్టి కాజల్ ను శ్వేత నమ్మిందా లేదా అన్న కన్ఫ్యూషన్ లో ప్రేక్షకులు ఉన్నారు. ఇక ఈ రోజు జరగనున్న ఎలిమినేషన్ నామినేషన్ మరింత ఆసక్తికరంగా సాగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: